- Telugu News Photo Gallery Can all these problems be reduced with sunflower seeds? Check Here is Details in Telugu
Sun Flower Seeds: సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే.. ఇన్ని సమస్యలు తగ్గుతాయా..
సన్ ఫ్లవర్ ఆయిల్‌ని ఈ మధ్య కాలంలో చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఈ ఆయిల్‌ని సన్ ఫ్లవర్ సీడ్స్ నుంచే తయారు చేస్తారు. ఈ మధ్య కాలంలో ఈ సీడ్స్ తినడం వల్ల అనేక అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది..
Updated on: Dec 11, 2024 | 2:07 PM

సన్ ఫ్లవర్ సీడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి చాలా మందికి తెలుసు. ఈ మధ్య కాలంలో సీడ్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. సాధారణంగా సన్ ఫ్లవర్ సీడ్స్‌తో నూనె తీస్తూ ఉంటారు. కానీ ఈ విత్తనాలను తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని, ఎన్నో రకాల సమస్యలకు బైబై చెప్పొచ్చని హెల్త్ స్పెషలిస్టులు అంటున్నారు.

పొద్దు తిరుగుడు గింజలు కాస్త నల్లగా, జీలకర్రలా అనిపిస్తాయి. కానీ ఈ చిన్న విత్తనాలతో అనేక అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, అర్థరైటిస్ నొప్పులు కంట్రోల్ అవుతాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ బి6, ఇ, మెగ్నీషియం, రాగి వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విత్తనాలలోని విటమిన్లు E, C గుండె జబ్బుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ E శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్దిగా ఉంటాయి. వీటిలో సెలీనియం, విటమిన్ E వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే కణ నాశనాన్ని నిరోధిస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి పొద్దుతిరుగుడు విత్తనాలు క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, సెలీనియం, రాగి ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయని చెబుతారు. పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. చర్మాన్ని హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తుంది.




