Hair care: ఈ నేచురల్ హెయిర్ మాస్క్ లు మీ జుట్టును మెరిసేలా చేస్తాయి..
ఒత్తైన, పొడవాటి కురులు ఆడవారి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. అయితే ప్రస్తుత యాంత్రిక జీవన పరిస్థితుల్లో చాలామంది చుండ్రు,
ఒత్తైన, పొడవాటి కురులు ఆడవారి అందాన్ని రెట్టింపు చేయడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. అయితే ప్రస్తుత యాంత్రిక జీవన పరిస్థితుల్లో చాలామంది చుండ్రు, హెయిర్ ఫాల్, జుట్టు పొడి బారడం, నిర్జీవంగా మారడం.. తదితర సమస్యలతో సతమతవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం పోషకాహార లోపం కాగా జుట్టు సంరక్షణ కోసం వినియోగించే రసాయన ఉత్పత్తులు మరో కారణం. ముఖ్యంగా హెయిర్ డ్రయ్యర్లు వంటి హీటింగ్ టూల్స్ ను ఎక్కువగా వాడడం వల్ల జుట్టులో తేమ తగ్గిపోయి పొడిగా మారుతంది. నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమస్యలను ఇలాగే నిర్ల క్ష్యం చేస్తే జుట్టు రాలడం ప్రారంభమవుతంది. ఈ క్రమంలో ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో హెయిర్ ప్యాక్ లు, మాస్క్ లు తయారుచేసుకుంటే శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు.
అవకాడో
అవకాడోలో మినరల్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నిర్జీవమైన జుట్టును మళ్లీ మెరిసేలా చేయడంలో ఎంతగానో తోడ్పడుతాయి. అవకాడో మాస్క్ చేయడానికి అవకాడో పండ్లను బాగా మాష్ చేసి అందులో గుడ్డు మిక్స్ చేసి జట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. సుమారు అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. వారంలో కనీసం ఒకసారైనా ఈ అవకాడో హెయిర్ మాస్క్ ను వినియోగిస్తే మంచి ఫలితముంటుంది.
ఆలివ్ నూనె
ఈ నూనెను నేచురల్ కండీషనర్‌గా కూడా పరిగణిస్తారు. ఒక పాత్రలో ఆలివ్ నూనెను వేడి చేసి, కొద్దిగా చల్లగైన తర్వాత శిరోజాలకు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ ను జుట్టుకు కట్టి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు మెరవడమే కాకుండా మృదువుగా తయారువుతంది.
యాపిల్ వెనిగర్
పట్టులాంటి జుట్టు కోసం యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, యాపిల్ వెనిగర్‌లో 2 టీస్పూన్ల ఆలివ్ నూనె , ఒక గుడ్డు కలపడం ద్వారా మాస్క్‌ను తయారు చేయండి. ఇప్పుడు ఈ మాస్క్‌ని జుట్టు కుదుళ్లకు అరగంట పాటు పట్టించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆపై షాంపూతో తలస్నానం చేయాలి.
అలోవెరా జెల్
ఆరోగ్యకరమైన జుట్టు కోసం అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దెబ్బతిన్న జుట్టును మళ్లీ మెరిసేలా చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల చుండ్రు, దురద లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మాస్క్ చేయడానికి, కలబంద జెల్‌ను నేరుగా జుట్టుకు అప్లై చేసి, 30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడిగిస్తే సరిపోతుంది.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ బకాయిలు, పీఆర్సీల జీవోల విడుదల..
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ బకాయిలు, పీఆర్సీల జీవోల విడుదల..