AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Switzerland: స్విట్జర్లాండ్‌లోని ఈ ప్రదేశం స్వర్గం కంటే ఎక్కువ.. రాత్రి 9 గం. సూర్యాస్తమం..

స్విట్జర్లాండ్‌ను భూతల స్వర్గంగా పరిగణిస్తారు. ఈ దేశంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలు, అధిక జీవన నాణ్యత, చక్కటి మౌలిక సదుపాయాల కారణంగా ప్రపంచ వాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, జీవనశైలిని ప్రజలు చాలా ఇష్టపడతారు. ఆల్ప్స్ పర్వతాలు, సరస్సులు, ద్రాక్ష తోటలు, సుందరమైన గ్రామాలతో ప్రకృతి సౌందర్యం కలిగి ఉంది. ఇవన్నీ కలిసి స్విట్జర్లాండ్‌ను ఒక అందమైన ప్రదేశంగా మార్చాయి. ఇక్కడ ఉన్న అందమైన ప్రదేశం మెన్జికాన్ విశిష్ట గురించి తెలుసుకుందాం..

Switzerland: స్విట్జర్లాండ్‌లోని ఈ ప్రదేశం స్వర్గం కంటే ఎక్కువ.. రాత్రి 9 గం. సూర్యాస్తమం..
Switzerland Menziken
Surya Kala
|

Updated on: Jun 23, 2025 | 7:51 PM

Share

స్విట్జర్లాండ్‌ చుట్టూ ఉన్న పర్వతాలు, సరస్సులు , పచ్చని పొలాల సహజ సౌందర్యం అందరినీ ఆకర్షిస్తుంది. మెన్జికాన్ ఇక్కడ ఒక గ్రామీణ ప్రాంతం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సూర్యాస్తమయం సమయం రాత్రి 9:30 గంటలు. ఇది ఒక చిన్న పట్టణం. దీనికి మునిసిపాలిటీ హోదా కూడా ఉంది.

జూరిచ్ విమానాశ్రయం నుంచి మెన్జికెన్ వరకు దూరం దాదాపు 65 కిలోమీటర్లు. రోడ్డుకు ఇరువైపులా కంటికి కనిపించేంత వరకు పచ్చదనం తప్ప మరేమీ ఉండదు. కొంత మైదాన ప్రాంతం. కొంత వాలుపై పండిన పంటలతో పచ్చదనం ఉన్న పొలాలు. గోధుమ , మొక్కజొన్న పంటలు సిద్ధంగా ఉండి పర్యాటకులకు కనుల విందు చేస్తాయి. ఈ నగరంలో అడగడుగునా దట్టమైన చెట్ల వరుసలు కనిపిస్తాయి. అంతేకాదు ఈ గ్రామంలో సూర్యాస్తమం రాత్రి 9 తర్వాత జరుగుతుంది.

ప్రశాంతమైన వాతావరణం ఇది పర్యాటకులకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ త్వరగా అయితే ఒక అందమైన ప్రదేశంలో ప్రయాణం.. అద్భుతంగా ఉంటుంది. విమానాశ్రయం నుంచి గమ్యస్థానానికి చేరుకోవడానికి మెట్రో సౌకర్యం ఓదార్పునిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు. మిమ్మల్ని ఆపడానికి లేదా ముందుకు సాగడానికి సూచించడానికి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ సరిపోతాయి. రోడ్లపై వాహనాలు వాటి లేన్లలో కదులుతున్నాయి. ఓవర్‌టేక్ చేయాల్సిన అవసరం బహుశా ఎవరికీ రాదు. ఇక్కడ ఎవరూ వెళ్లేందుకు తొందరపడటం కనిపించదు. రోడ్లు ఖాళీగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

చుట్టూ పచ్చదనం ఈ ప్రదేశాలు చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటాయి. శబ్దం, జనసమూహానికి దూరంగా ఉంటాయి. గేటు వద్ద లేదా ఏదైనా మలుపు వద్ద నిలబడి ఉన్న వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపించదు. పర్యాటకులు ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించేలా, ఆనందించేలా వారు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని వైపులా పచ్చదనంతో చుట్టుముట్టి ఉండే ఈ ప్రదేశాలు స్వర్గం కంటే తక్కువ కాదు. స్విట్జర్లాండ్‌కు వచ్చే పర్యాటకులకు ఈ ప్రదేశం సరైనది. ఇక్కడ మీరు చుట్టూ శాంతి, పచ్చదనాన్ని చూస్తారు.

ప్రకృతి అందాలను పరిరక్షించేందుకు ఇక్కడి నివాసితులు తమ అవసరాలను పరిమితం చేసుకున్నారు. ప్రభుత్వం, సంస్థలు ఇందులో పాత్ర పోషిస్తాయి. అయితే ఈ వ్యవస్థ విజయం దానిని అనుసరించే వారిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడి పౌరులు అప్రమత్తంగా ఉంటారు. వారికి తమ విలువైన స్థలం పట్ల అచంచలమైన ప్రేమ ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి పర్యాటకులను స్విట్జర్లాండ్‌కు ఆకర్షించే ఆకర్షణ ఏమిటో మీకు తెలుసా..

ఈ ప్రాంత నివాసితులు పర్వతాలను కట్ చేసి.. సరస్సులను ఎండబెట్టడం ద్వారా సృష్టించబడిన భూమిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే తమ స్థిరనివాసానికి సరిపోతుందని భావించారు. వారికి జీవం పోసే, స్విట్జర్లాండ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చే పచ్చదనం కోసం పెద్ద భాగం మిగిలిపోయింది. దాని వెనుక ఆల్ప్స్ పర్వత శ్రేణి ఉంది ఇది స్విట్జర్లాండ్ లో ప్రసిద్ధి చెందింది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..