AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారత దేశానికి వెళ్లొద్దు.. మీ జీవితం మారిపోతుందన్న అమెరికెన్.. భారతీయుల మనసు దోచిన వీడియో..

భారత దేశానికి వచ్చిన ఓ అమెరికన్ టూరిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక రీల్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. భారత దేశానికి వెళ్లొద్దు అంటూ జూన్ 15న తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు భారతీయులు ఈ రీల్ ని తెగ షేర్ చేస్తున్నారు. లక్షల్లో వ్యూస్, వేలల్లో కామెంట్లను సొంతం చేసుకుంటుంది. మరి ఈ వీడియోలో భారతీయులను అంతగా ఆకట్టుకుంటున్న విషయం ఏమున్నదంటే..

Viral Video: భారత దేశానికి వెళ్లొద్దు.. మీ జీవితం మారిపోతుందన్న అమెరికెన్.. భారతీయుల మనసు దోచిన వీడియో..
KristenfischerImage Credit source: instagram/kristenfischer3
Surya Kala
|

Updated on: Jun 23, 2025 | 7:52 PM

Share

భారతీయులు తమ భవిష్యత్ కోసం అమెరికా బాట పట్టడమే కాదు.. అగ్రరాజ్యం నుంచి కూడా భారత దేశానికి కొంతమంది వస్తారు. అలా కొలరాడోకు చెందిన క్రిస్టేన్ ఫిస్కేర్ నాలుగేళ్ళ క్రితం భారత దేశానికి తన ఫ్యామిలీతో వచ్చారు. దేశ రాజధాని డిల్లీలో భర్త,నలుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. స్కై ఫిష్ డెవలప్ మెంట్ అనే పేరుతో ఐటీ కంపెనీని రన్ చేస్తున్నారు. కాగా క్రిస్టేన్ ఫిస్కేర్ ఈ నెల 12 వ తేదీన ఒక రీజ్ లో షేర్ చేశారు. ఇందులో నా మాట వినండి.. భారతదేశానికి వెళ్ళాలని అనుకోకండి… ఎందుకంటే అక్కడే జీవితాంతం నివసించాలనే కోరికని కలిగిస్తుంది. ఇక్కడ మీరు అద్భుతమైన వ్యక్తులను కలుస్తారు.. రుచికరమైన అద్భుతమైన ఆహరాన్ని తింటారు. కొన్ని అద్భుతమైన దృశ్యాలను చూడడమే కాదు.. దేశంలోని గొప్ప సంస్కృతి, చరిత్రను ప్రతి నిమిషం అనుభవిస్తారు. దీంతో ఎప్పటికీ భారత దేశాన్ని విడిచి మీరు మీ దేశాలకు వెళ్ళాలని కోరుకోరు. ఎందుకంటే మీ హృదయంలో భారత దేశం నిలిచి ఉంటుంది. మీ జీవితాన్ని అందంగా.. అద్భుతంగా మార్చే ప్రదేశం.. దీంతో మళ్ళీ మీ సొంత దేశానికి వెళ్ళాలనే ఆలోచన కూడా కలిగించందు అని భారత దేశం గురించి చెప్పడమే కాదు.. తాను భారత దేశంలో అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు.. అంటూ ఒక లవ్ సింబల్ తో ఉన్న ఒక రీల్ ని చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Kristen Fischer (@kristenfischer3)

ఇన్ డైరెక్ట్ గా భారత దేశం గొప్పదనం గురించి చెప్పడం తో నెటిజన్ల హృదయాన్ని గెలుచుకుంది ఈ వీడియో. ఓ రేంజ్ లో నెటిజన్లు స్పందిస్తున్నారు. అంతేకాదు చాలామంది విదేశీయులు తమ భారత దేశ పర్యటనని… అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒకరు మీరు చెప్పింది నిజం… నేను భారత దేశానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ దేశం విడిచి సొంత దేశానికి వెళ్లాలనుకోలేదు అని కామెంట్ చేశారు. తనకు భారత దేశమ అన్నా.. ఆ దేశస్తులు అన్నా చాలా ఇష్టం అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొక టూరిస్ట్ భారత దేశ పర్యటన గురించి తన అనుభవాన్ని గురించి చెబుతూ.. తాను 2018లో ఫస్ట్ టైం భారత్ కి వచ్చినట్లు.. 3 నెలలు అనేక ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరిగి సొంత దేశానికి వెళ్తుంటే.. తనకు ఏడుపొచ్చిందని చెప్పాడు. తర్వాత 2019లో కేరళలో ఒక ప్లేస్ లో కొనుగోలు చేశానని.. 2021 నుంచి భారత్ లోనే నివాసం ఉంటున్నానని చెప్పాడు.

భారత దేశం గురించి మరొక వీడియోను జూన్ 22న క్రిస్టేస్ ఫిష్కేర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇది కూడా ఓ రేంజ్ లో నేట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కూడా అమెరికాలో సగటు జీవితం గడపడం కంటే భారత్ లో అసాధారణ జీవితాన్ని గడపడానికే తాను ఇష్టపడినట్లు క్రిస్టేన్ చెప్పింది. గత 4 ఏళ్ల నుంచి భారతదేశంలో ఉంటున్నాం.. ఒక్కసారి కూడా మేము చింతించలేదని చెప్పింది. మొత్తానికి భారతదేశం తమా కుటుంబ సభ్యుల జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు