Viral Video: నీటిలో తేలియాడుతూ కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు తేలేశారు
చేపల వేటకు వెళ్లిన ఓ ఫ్యామిలీకి అనుకోని విధంగా ఒక విచిత్ర జలచరం కనిపించింది. అది ఏంటా అని చూడగా దెబ్బకు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

సముద్ర గర్భంలో ఎన్నోరకాల జలచరాలు నివాసముంటాయి. పైకి మనకు కనిపించే సముద్రపు జీవులు మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో రకాల వింత జీవులు సముద్రం లోతున సంచరిస్తుంటాయి. సైన్స్‌కు చిక్కని ఎన్నో అంతుచిక్కని రహస్యాలు సముద్రానికి సొంతం. చేపలు, సొరచేపలు, తిమింగలాలు లాంటివి మీరు చూసి ఉంటారు. మరి మీరెప్పుడైనా గబ్బిలం(బ్యాట్) ఆకారంలో ఉండే జలచరాలను చూశారా.? దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇండియా అటుంచితే.. అమెరికాలోని పలు ప్రాంతాల్లో వీకెండ్ వస్తే చాలు.. అలా సరస్సుల దగ్గరకు పిక్నిక్‌కి వెళ్తుంటారు జనాలు. ఇక ఇప్పుడు మనం ఫ్లోరిడాలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. అక్కడే స్థానికంగా నివాసముంటున్న ఓ కుటుంబం స్థానికంగా ఉన్న ఓ సరస్సు దగ్గరకు పిక్నిక్‌కు వెళ్లారు. ఎటూ వచ్చాం కదా.. కాసేపు ఫిషింగ్ చేస్తే పోలే అని.. హుక్ కట్టి.. నీటిలోకి గాలం వేశారు. చేప చిక్కడం అటుంచితే.. పక్కనే నీటితో తేలుతూ ఓ వింత ఆకారం కనిపించింది. అచ్చం గబ్బిలంలా.. నీటిలో ఈదుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది. ఆ కుటుంబం దెబ్బకు షాక్ అయ్యి.. చేపలు పట్టడం ఆపేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఇంతకీ ఆ జలచరం ఏంటని ఆలోచిస్తున్నారా.? అప్లిసియా జాతికి చెందిన ఈ వింత జీవులను సముద్రపు కుందేళ్లని పిలుస్తారట. ఇవి ప్రోటీన్‌తో తయారు చేయబడిన మృదువైన అంతర్గత షెల్‌తో మధ్యస్థ పరిమాణంలో ఉంటాయట. ఈ జంతువు ఉనికి రోమన్ కాలం నాటిదట. గుండ్రని ఆకారం, వాటి తలల నుంచి పైకి ప్రొజెక్ట్ చేయబడిన రెండు పొడవైన కొమ్ములను.. కుందేలు చెవులను పోలి ఉంటాయి. ఇవి సుమారు 7-20 సెంటిమీటర్ల పొడవు ఉంటాయట. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.
ఇది చదవండి: ఉబ్బిన పొట్టతో దూరంగా కనిపించిన కొండచిలువ.. అనుమానమొచ్చి కోసి చూడగా
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
