Shirdi Tour: న్యూ ఇయర్‌కి టూర్ ప్లాన్ చేస్తున్నారా.? రూ. 2400కే హైదరాబాద్ టూ షిరిడీ ప్యాకేజీ.
కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. తమకు నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మీరు కూడా కొత్తేడాదికి టూర్ ప్లాన్ చేస్తున్నారా.? అయితే మీకోసమే తెలంగాణ టూరిజం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది...
కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. తమకు నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మీరు కూడా కొత్తేడాదికి టూర్ ప్లాన్ చేస్తున్నారా.? అయితే మీకోసమే తెలంగాణ టూరిజం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరకే షిరిడీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి షిరిడీ ఒక్క రోజులో ప్లాన్ చేసుకునే వారికి ఈ ప్యాకేజీ బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీలో కేవలం షిరిడి మాత్రమే కవర్ అవుతుంది. కేవలం ఒక్క రోజు ట్రిప్ కావడంతో టూర్‌ని షిరిడీ పట్టణానికి మాత్రమే పరిమితం చేశారు. టూర్‌లో భాగంగా మొదటి రోజు హైదరాబాద్ దిల్‌షుక్ నగరలో టూరిజం బస్సు బయలు దేరుతుంది. బషీర్‌బాగ్, బేగంపేట్, కేపీహెచ్‌బీ, మియాపూర్‌లలో బస్సు ఆగుతుంది. రాత్రంగా ప్రయాణం చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం 7 గంటలకు షిరిడీ చేరుకుంటారు. అనంతం హోటల్‌లో ఫ్రెషప్ అయిన తర్వాత షిరిడీ ఆలయ దర్శనం ఉంటుంది. అనంతరం షిరిడీలోని ఇతర దేవాలయాల దర్శన అనంతరం లంచ్ ఉంటుంది. మళ్లీ సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
ధర విషయానికొస్తే.. నాన్ ఏసీ బస్సులో పెద్దలకు ఒకరికి రూ.2400, పిల్లలకు ఒకరికి రూ.1,970. వోల్వో ఏసీ బస్సులో పెద్దలకు ఒకరికి రూ.3200, పిల్లలకు ఒకరికి రూ.2,610గా ఉంది. నాన్ ఏసీ హోటల్‌లో ఫ్రెషప్, షిరిడీ ఆలయ దర్శనం, ఇతర ఆలయాల్లో దర్శనం ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. భోజనం, ఎంట్రీ ప్యాకేజీలో ఇందులో కవర్ అవ్వవు. ఆసక్తి ఉన్న పర్యాటకులు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..