Papikondalu Tour: తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా.. అయితే ఆంధ్రా కాశ్మీరం ఉందిగా..!
Papikondalu Tour: కొబ్బరి తోటలు, గోదావరి పరవళ్లు, సముద్రం తీరం ప్రకృతి అందాలతో అలరారుతుంది ఆంధ్రప్రదేశ్. ఇక ప్రకృతి శోభకు పుట్టిల్లు ఏపీ.. అందుకనే ప్రకృతి ప్రేమికులు ఏపీని కోహినూర్ ఆఫ్ ఇండియాగా...
Papikondalu Tour: కొబ్బరి తోటలు, గోదావరి పరవళ్లు, సముద్రం తీరం ప్రకృతి అందాలతో అలరారుతుంది ఆంధ్రప్రదేశ్. ఇక ప్రకృతి శోభకు పుట్టిల్లు ఏపీ.. అందుకనే ప్రకృతి ప్రేమికులు ఏపీని కోహినూర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, కొండలు కోనలు, బీచ్ లు వంటి అనేక పర్యాటక ప్రాంతాలకు నెలవు.. తమ కుటుంబం తో తక్కువ ఖర్చుతో పర్యటించాలి అనుకునేవారికి అనేక ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఏపీలోని పర్యాటక ప్రాంతాలు ..
వాటిల్లో ఒకటి పాపికొండల యాత్ర.. తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి పాపికొండలు. ఇవి ఏపీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను అనుకుని ఉన్నాయి. పాపికొండల ప్రాంతంలో ఉన్న చెట్లు ఆకులను రాల్చవు.. అంతేకాదు ఈ ప్రాంతం.. చాలా ప్రశాంతగా ఉంటుంది. అందంగా రమణీయంగా ఉంటూ ఆహ్లాదం కలిగించే ప్రదేశం పాపికొండలు. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణం ఇవన్నీ చూసిన వారు ఆంధ్రా కాశ్మీర్ అని పేరు పెట్టారు. వేసవి కాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం దగ్గర జలపాతం ఉంది. ఇక్కడ సర్పం నీడలో శివలింగం అద్భుతంగా ఉంటుంది.
పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంది. రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య చేసే లాంచీ ప్రయాణం పర్యటకులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. పాపికొండల విహార యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ద్వీపం నుండి మొదవుతుంది. అక్కడినుండి పోలవరం, రాజమండ్రి, కూనవరం, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.
పాపికొండల అడవులు వన్య ప్రాణుల నిలయం. ఇక్కడ పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు, జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. సరదాగా ఫ్యామిలీతో ఎక్కడికైనా పర్యటించాలి అనుకునేవారికి పాపికొండల పర్యటన చాలా సంతోషాన్ని .. మరచిపోలేని అనుభూతినిస్తుంది.
Also Read: సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!
వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..! ఈ చిట్కాలు పాటించి చూడడండి.. రిలీఫ్ పొందండి..