AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka : మీకు సోలో ట్రిప్స్ అంటే ఇష్టమా.. అయితే కర్ణాటకలో ఈ ప్లేస్‌లకు వెళ్లాల్సిందే

చాలా మంది బైక్ పై ఒంటరిగా దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలా మందికి ఎలాంటి ప్రదేశాలకు వెళ్లాలో తెలియదు.

Karnataka : మీకు సోలో ట్రిప్స్ అంటే ఇష్టమా.. అయితే కర్ణాటకలో ఈ ప్లేస్‌లకు వెళ్లాల్సిందే
Solo Travelers
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2022 | 6:49 PM

Share

చాలా మంది మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి టూర్ లు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చాలా మంది బైక్ పై ఒంటరిగా దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలా మందికి ఎలాంటి ప్రదేశాలకు వెళ్లాలో తెలియదు. అలాంటి వారికోసమే ఇది. ఈ ప్రదేశాలు సోలో ట్రిప్ ప్రియులకు మంచి ,సురక్షితమైన ప్రదేశాలలో కర్ణాటక ఒకటి. కర్ణాటకలో అత్యంత సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. కర్ణాటకలో సోలో ట్రిప్ కోసం మనం వెళ్లదగిన ప్లేస్ లు ఏవంటే..

హంపి: ప్రస్తుతం ఇది ఒక మతపరమైన, పర్యాటక కేంద్రంగా ఉంది, ఇక్కడ పురాతన చరిత్ర గురించి తెలిపే అనేక శిల్పాలను చూడవచ్చు. భారీ పర్వతాలతో పాటు ప్రవహించే తుంగా నది ఈ పట్టణానికి శోభను చేకూరుస్తుంది. సోలో ట్రిప్ ప్రేమికులు తప్పక సందర్శించవలసిన కర్ణాటకలోని అగ్ర ప్రదేశాలలో ఇది ఒకటి. సందర్శనా స్థలాలే కాకుండా, మీరు మంచి చారిత్రక సమాచారాన్ని కూడా పొందవచ్చు

గోకర్ణ: బీచ్ ప్రేమికులకు ఇది అనువైన పర్యాటక ప్రదేశం. చల్లని గాలి, సముద్రపు అలలు, సూర్యాస్తమయం వీక్షణ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. సోలో ట్రిప్ ఇష్టపడే వారు ఇక్కడ సాయంత్రం ఒంటరిగా గొప్ప క్షణాన్ని గడపవచ్చు. వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. అదనంగా, ఆధ్యాత్మిక భక్తుల కోసం మహాబలేశ్వర్ ఆలయం, మనస్సులోని చింతలను పోగొట్టడానికి ప్రశాంతమైన బీచ్‌లు ఇక్కడ చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

చిక్కమగళూరు: కర్ణాటకలోని కాఫీ జిల్లాగా పేరొందిన చిక్కమగళూరు కాఫీ ప్రియులకు ఇష్టమైన పర్యాటక ప్రాంతం. అద్భుతమైన కొండలు, లోయలతో నిండిన ప్రాంతం మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకువెళుతుంది. ముల్లయనగిరిలో ట్రెక్కింగ్ నుంచి భద్ర నదిలో రివర్ రాఫ్టింగ్ వరకు, ఇక్కడ చాలా సాహసాలు చేయవచ్చు. మీరు మీ ఒత్తిడితో కూడిన జీవితాన్ని విడిచిపెట్టి, మీ మనస్సును రిలాక్స్ చేసే ప్రాంతం ఇది.

మైసూర్: మైసూర్ దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ ప్రదేశం మైసూర్ ప్యాలెస్. ఇక్కడ మీరు రాజ కుటుంబ చరిత్రను ప్రతిబింబించే నిర్మాణాలను చూడవచ్చు. మరో ప్రధాన ఆకర్షణ ఛాముండి కొండ. విస్తృత శ్రేణి పట్టు చీరలు , రుచికరమైన ఆహారంతో పాటు ముఖ్యంగా మైసూర్ పాక్ నోరూరిస్తుంది.

కార్వార్: ఇక్కడి ప్రశాంతత ప్రతి పర్యాటకుడిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ప్రశాంతమైన, పొడవైన బీచ్‌లలో ఒకటి, దేవ్‌బాగ్ బీచ్ సరుగుడు చెట్లతో నిండి ఉంటుంది. కోడిబాగ్ కోట శిథిలాలు, దాని చుట్టూ ఉన్న బీచ్‌లు చరిత్రలో నిలిచిన మరొక ప్రదేశం. కాబట్టి కార్వార్ ఒంటరిగా ప్రయాణించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.