AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Tour: గుడ్‌న్యూస్.. అయోధ్యకు తక్కువ ధరలోనే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ..

రాముల వారి భక్తులకు ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యకు వెళ్లి బాల రాముడిని దర్శించుకునేందుకు మంచి అవకాశం లభ్యమైంది. బాల రాముడితో పాటు ఇతర దేవాలయాలు కూడా అతి తక్కువ ధరలోనే దర్శించుకునే సదావకాశాన్ని ఇస్తోంది. అయోధ్యకు స్పెషల్‌గా టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. సామాన్య భక్తులకు తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇందులో భాగంగానే గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు..

Ayodhya Tour: గుడ్‌న్యూస్.. అయోధ్యకు తక్కువ ధరలోనే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ..
Irtc
Chinni Enni
|

Updated on: Jan 23, 2024 | 7:25 PM

Share

రాముల వారి భక్తులకు ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్యకు వెళ్లి బాల రాముడిని దర్శించుకునేందుకు మంచి అవకాశం లభ్యమైంది. బాల రాముడితో పాటు ఇతర దేవాలయాలు కూడా అతి తక్కువ ధరలోనే దర్శించుకునే సదావకాశాన్ని ఇస్తోంది. అయోధ్యకు స్పెషల్‌గా టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. సామాన్య భక్తులకు తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇందులో భాగంగానే గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు.. అయోధ్యలోని రామాలయం నుంచి ప్రారంభమై.. ప్రయోగ్‌ రాజ్‌తో పాటు మరో మూడు జ్యోతిర్లింగాలకు ప్రయాణం చేయనుంది. ఇందులో మరికొన్ని ప్రదేశాలు కూడా యాడ్ కానున్నాయి. మరి ఈ టూర్ ఎప్పుడు మొదలు కానుంది? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? అనే వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

టూర్ ఎప్పుడు ప్రారంభం కానుందంటే..

ఈ యాత్ర ఫిబ్రవరి 05వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీలో అనేక ప్రదేశాలు కవర్ కానున్నాయి. అవేంటంటే.. ప్రయాగ్ రాజ్, అయోధ్య, వారణాసి, చిత్ర కూట్, నాసిక్, ఉజ్జయిని వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని పొందుతారు. అదే విధంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నుండి సురేంద్ర నగర్, విరామ్‌గామ్, ఛాయా పురి, నదియాడ్, గోద్రా, రత్లాం వంటి ప్రయాణికులు బోర్డింగ్ సౌకర్యం పొందనున్నారు.

ఈ ప్యాకేజీ వివరాలు..

ఈ ప్యాకేజీ 10 పగళ్లు, 9 రాత్రులు ఉంటుంది. భారత్ గౌరవ్ ప్రయాణం రైలులో ఉంటుంది. ఎకానమీ ఏసీ, 3 ఏసీ, 2 ఏసీ కోచ్‌లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రయాణికులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం కూడా ఉంటుంది. అంతే కాకుండా దేవాలయాలకు వెళ్లేటప్పుడు బస్సు సౌకర్యం కూడా కల్పించబడుతుంది.

ఇవి కూడా చదవండి

టికెట్ల ధరల వివరాలు..

ఈ టూర్ ప్యాకేజీలో ధరలు కోచ్‌ల ప్రకారం వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.46 వేలు, కంఫర్ట్ క్లాస్ కోచ్‌లోప్రయాణించేందుకు రూ.33 వేలు, ఎకానమీ క్లాస్ టికెట్ కొనుగోలుకు రూ.20,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా అయోధ్యతో పాటు మరిన్ని దేవాలయాలను అతి తక్కువ ధరలోనే దర్శించే అవకాశం ఐఆర్‌సీటీసీ అందిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..