AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: దీపావళి స్పెషల్ IRCTC టూర్ ప్యాకేజీ.. అండమాన్, నికోబార్‌లో తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి ఇలా..

అండమాన్, నికోబార్‌ను సందర్శించేందుకు IRCTC 5 రాత్రులు 6 పగళ్ల ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది. అండమాన్-నికోబార్ వెళ్లి తెల్లటి ఇసుకను కూడా చూడవచ్చు. అనేక చిన్న ద్వీపాలలో తిరగవచ్చు. సుందరమైన అందాలను చూడవచ్చు. IRCTC హోటల్, ఆహారం, స్థానిక ప్రయాణాన్ని చూసుకుంటుంది. ఈ టూర్ ప్యాకేజీలు నవంబర్ 6 నుంచి నవంబర్ 24 మధ్య అందుబాటులో ఉంటాయి.

IRCTC Tour: దీపావళి స్పెషల్ IRCTC టూర్ ప్యాకేజీ.. అండమాన్, నికోబార్‌లో తక్కువ ఖర్చుతో ఎంజాయ్ చేయండి ఇలా..
Irctc Diwali Special Offer
Surya Kala
|

Updated on: Nov 04, 2023 | 7:11 AM

Share

అండమాన్, నికోబార్ సందర్శించాలని చాలా మంది కోరుకుంటారు. మీరు కూడా ఇలాంటి ప్లాన్‌ని ఎన్ని చేసినా ప్రతిసారీ బడ్జెట్‌ సరిపోలేదని ఆలోచించి వెనకడుగువేస్తే.. ఇప్పుడు IRCTC అందిస్తోన్న ప్రత్యేక ప్యాకేజీపై ఓ లుక్ వేయవచ్చు. ముఖ్యంగా దీపావళి వేడుకలను స్పెషల్ గా జరుపుకోవాలని అనుకుంటే..  అండమాన్ , నికోబార్‌ దీవులకు పయనం కండి. ఇక్కడ దీపావళిని ప్రత్యేక పద్ధతిలో కూడా జరుపుకోవచ్చు. ఇందు కోసం మీరు కేవలం రూ.27,450 మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది.

అండమాన్, నికోబార్‌ను సందర్శించేందుకు IRCTC 5 రాత్రులు 6 పగళ్ల ప్రత్యేక ప్యాకేజీని రూపొందించింది. అండమాన్-నికోబార్ వెళ్లి తెల్లటి ఇసుకను కూడా చూడవచ్చు. అనేక చిన్న ద్వీపాలలో తిరగవచ్చు. సుందరమైన అందాలను చూడవచ్చు. IRCTC హోటల్, ఆహారం, స్థానిక ప్రయాణాన్ని చూసుకుంటుంది. ఈ టూర్ ప్యాకేజీలు నవంబర్ 6 నుంచి నవంబర్ 24 మధ్య అందుబాటులో ఉంటాయి.

ప్యాకేజీలో సందర్శించాల్సిన స్థలాలు..

IRCTC టూర్ ప్యాకేజీ పోర్ట్ బ్లెయిర్ నుండి ప్రారంభమవుతుంది. ఇందులో మీరు కార్బన్స్ కోవ్ బీచ్, సెల్యులార్ జైలు, రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్, హేవ్‌లాక్ ఐలాండ్, కాలాపత్తర్ బీచ్, రాధా నగర్ బీచ్, నీల్ ఐలాండ్, నేచురల్ బ్రిడ్జ్, లక్ష్మణపూర్ బీచ్, భరత్‌పూర్ బీచ్‌లను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

టూర్ ప్యాకేజీలో లభించే వసతులు

ఈ ప్యాకేజీలో భాగంగా డబుల్, ట్రిపుల్ షేరింగ్‌లో ఎయిర్ కండిషన్డ్ వసతిని పొందుతారు. అవసరమైతే  అదనపు మ్యాట్రెస్ లు అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు స్థానిక స్థాయిలో ప్రయాణం,  సందర్శనా ఖర్చులు, ఎంట్రీ పర్మిట్, ఎంట్రీ టికెట్, ఫెర్రీ టికెట్, అటవీ ప్రాంత అనుమతి, ఆహారం,  పానీయం, రాకపోకలు రవాణా కోసం సహాయకుడు వంటి ఇతర ఖర్చులు ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా లభిస్తాయి.

ప్యాకేజీ ₹27,450 నుండి ప్రారంభం

IRCTC అందిస్తున్న ఈ ప్యాకేజీ రూ. 27,450 నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర ట్రిపుల్ షేరింగ్‌లో ఒకే ప్రయాణికుడి కోసం. డబుల్ ఆక్యుపెన్సీ కోసం మీరు ఒక్కో ప్రయాణికుడికి రూ. 30,775 చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీకి మీరు రూ. 52,750 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేక బెడ్ కోసం రూ.17 వేలు, 2 నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ లేకుండా రూ.13,550 చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..