ప్రకృతి ప్రియులకు గమనిక..! హిమాచల్ ప్రదేశ్ వెళితే ఈ 5 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
Himachal Pradesh: దైనందిన జీవితంలో నిరంతర పని ఒత్తిడి వల్ల అలసట తప్పదు. నిత్యం రణగొన ధ్వనుల మధ్య బతికే పట్టణవాసులు ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకుంటారు.

Himachal Pradesh: దైనందిన జీవితంలో నిరంతర పని ఒత్తిడి వల్ల అలసట తప్పదు. నిత్యం రణగొన ధ్వనుల మధ్య బతికే పట్టణవాసులు ప్రకృతి ఒడిలో సేదతీరాలని అనుకుంటారు. అటువంటి వారికి హిమాచల్ ప్రదేశ్ చక్కటి ప్రదేశం. ఇక్కడి ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు మంచి అనుభూతిని మిగులుస్తాయి. ఇక్కడికి వెళ్లిన వ్యక్తులు కచ్చితంగా చూడాల్సిన 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
1. సిమ్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా. ఇది చాలా సుందరమైన ప్రదేశం. ఇక్కడ దొరికే యాపిల్స్ చాలా ప్రత్యేకమైనవి. అంతేకాదు ఇక్కడి ప్రజల ఆహార శైలి కూడా వెరైటీగా ఉంటుంది. ప్రతి మూలలో మ్యాగీ పాయింట్లు ఆహార ప్రియులందరికీ నచ్చుతాయి.
2. ధర్మశాల ధర్మశాల ఒక ప్రాచీన నగరం. ఇది ప్రయాణికులందరికీ ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. పచ్చదనం, టిబెటన్ సంస్కృతి, పర్వత మార్గాలు అందరిని ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఇక్కడ ఎత్తైన క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. ఇక్కడి కొండల అందం చూస్తే మైమరచిపోతారు.
3. కుఫ్రి ఈ ప్రదేశం స్వర్గాన్ని తలపిస్తుంది. పెద్ద పెద్ద పర్వతాల మధ్యలో ఏర్పాటు చేసుకున్న చిన్న కుటీరాలు మనకు జీవితంలో మంచి అనుభూతులను మిగుల్చుతాయి. నదులు, ప్రకృతి ఉద్యానవనాలు, సాహసోపేతమైన ట్రెక్కింగ్ గురించి చెప్పనవసరం లేదు.
4. కసోల్ మీకు జీవితంలో ఏదైనా స్పెషల్ కావాలంటే కసోల్ సందర్శించాల్సిందే. మీ బ్యాగ్‌లు, టిక్కెట్లు బుక్ చేసుకోండి కసోల్‌లో ల్యాండ్‌కండి. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒంటరి ప్రయాణికులైతే ఎక్కువ ఆలోచించకుండా మంచి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
5. డల్హౌసీ ఈ ప్రదేశం మిమ్మల్ని మేఘాలలో తేలేలా చేస్తుంది. ఎత్తైన ప్రదేశంలో రిసార్టులు, హోటళ్లు ఉంటాయి. మీ కిటికీ తెరిచి చూస్తే మీరు ఆకాశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి ఈ ప్రదేశం అనుకూలమైనది.