హుజూరాబాద్ బరిలో మరో విద్యార్థి నేత.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు.. అసలు ఎవరి వెంకట్?

Balmoori Venkat Narsing Rao: సుదీర్ఘ మంతనాలు..సమీక్షలు.. కసరత్తులు చేసిన కాంగ్రెస్ అధిష్టానం. ఎట్టకేలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ను బరిలో నిలిపింది.

హుజూరాబాద్ బరిలో మరో విద్యార్థి నేత.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు.. అసలు ఎవరి వెంకట్?
Balmoori Venkat Narsing Rao Copy
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 02, 2021 | 8:43 PM

Huzurabad Congress Candidate: సుదీర్ఘ మంతనాలు..సమీక్షలు.. కసరత్తులు చేసిన కాంగ్రెస్ అధిష్టానం. ఎట్టకేలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ను బరిలో నిలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే టీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో.. బల్మూరు వెంకట్‌ వైపే మొగ్గు చూపింది కాంగ్రెస్‌. ఇప్పటికే టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దించిన గులాబీ పార్టీ.. అందుకు ధీటైన వ్యక్తి కోసం అన్వేషించిన కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన వ్యక్తి అయిన బల్మూరు వెంకట నర్సింగరావు పేరును ఖాయం చేసింది. ఇక ఇద్దరు నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా బల్మూరు వెంకట్‌ రెండు పర్యాయాలుగా పనిచేస్తున్నారు. వెంకట్‌ పేరును ప్రతిపాదించే ముందు పార్టీ ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలు సైతం తీసుకుంది. అందిరీతో చర్చించిన తర్వాతే వెంకట్ పేరును ఖరారు చేశారు. వెంకట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడు. 2018 ముందస్తు ఎన్నికల్లో అక్కడి నుంచి టికెట్ ఆశించినప్పటికీ వెంకట్‌కు అవకాశం రాలేదు. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ.. అనేక విద్యార్థి సంబంధిత అంశాలపై ఎన్ఎస్‌యూఐని క్రియాశీలకంగా నడిపించడంతో వెంకట్ కీలక పాత్ర పోషించారు. విద్యార్థి అంశాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే వెంకట్‌ను బరిలో దింపుతున్నామన్నారు కాంగ్రెస్ నేతలు.

ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారవడంతో ఒక్కసారిగా అన్ని రాజకీయ పార్టీల్లో జోష్ పెరిగింది. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని ఇప్పటికే ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రత్యర్థి ఈటలను మట్టికరిపించేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అటు బీజేపీ తరపున ఈటల సైతం తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు.

బల్మూరి వెంకట్‌ నర్సింగరావు

  • భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు 
  • వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్‌ పేరే అధికారికంగా ఖరారు
  • తండ్రి : దివంగత మదన్ మోహన్ రావు
  • విద్య : ఎంబీబీఎస్
  • పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాం పూర్ మండలం తర్లపల్లి ఆయన స్వగ్రామం
  • 2015-17 : ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్
  • 2017 : ఎన్ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి
  • 2018-21 : ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్

Read Also…  Huzurabad By Election: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ఖరారు