Good News: కేవలం రూ. 1499కే విమానంలో ప్రయాణించండి.. ఈ అవకాశాన్ని ఎలా పొందాలంటే..
Airline Travel: విమాన ప్రయాణం ప్రతీ ఒక్కరికీ ఉండే కల. జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని ఆశ పడుతుంటారు. అందుకోసం రూపాయి, రూపాయి కూడబెట్టి తమ కలను నెర వేర్చుకుంటారు...
Airline Travel: విమాన ప్రయాణం ప్రతీ ఒక్కరికీ ఉండే కల. జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని ఆశ పడుతుంటారు. అందుకోసం రూపాయి, రూపాయి కూడబెట్టి తమ కలను నెర వేర్చుకుంటారు. అయితే విమాన ప్రయాణం అంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం కాదు. కనీసంలో కనీసం టిక్కెట్ ధర రూ. 3000 అయినా ఉంటుంది. అలా కాకుండా రూ. 1499కే విమానంలో ప్రయాణించే అవకాశం లభిస్తే ఎలా ఉంటుంది.? ఏంటీ ఏసీ బస్సుల్లోనే రూ. 1500 ధర ఉంది.. విమానంలో ఎలా సాధ్యమనేగా మీ సందేహం. అయితే మీ కోసమే గో ఫస్ట్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ అవాకాశాన్ని తీసుకొచ్చింది.
మాన్‌సూన్ సేల్‌లో భాగంగా రూ. 1499కే విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించింది. జులై 26 2022 నుంచి మార్చ్ 31, 2023 మధ్య విమానంలో ప్రయాణించే వారికోసం ఈ ఆఫర్‌ను ప్రకటించారు. టికెట్లను జులై 7 నుంచి జులై 10వ తేదీ మధ్య బుక్ చేసుకున్న వారికే ఈ అవకాశం లభిస్తుంది. సంస్థను ప్రమోట్ చేసుకునేందుకు గాను గో ఫస్ట్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే గో ఫస్ట్ తమ నెట్‌వర్క్‌ను విస్తృతి పరుచుకునే క్రమంలో కొచ్చి నుంచి అబు దాబేకు డైరక్ట్ సేవలను జూన్ 28న ప్రారంభించింది. గో ఫస్ట్ సంస్థ సీఈఓ కౌషిక్ మాట్లాడుతూ.. మిడిల్ ఈస్ట్‌తో ప్రయాణ బంధాన్ని మెరుగు పర్చేందుకు గాను కేరళ నుంచి అబు దాబికి నాన్ స్టాప్ విమానాలను నడుపుతున్నట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..