AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel During Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..

గర్భిణీలు ప్రయాణాల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో వారి ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో సాధారణంగానే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. గర్భిణీలు ఈ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తగా ఉండాలని..

Travel During Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణిస్తున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..
Travelling In Pregnancy
Srilakshmi C
|

Updated on: Jun 25, 2025 | 5:29 AM

Share

మనలో చాలా మందికి ట్రావెలింగ్‌ చాలా సరదా. అయితే అన్ని సమయాల్లో ఆ అలవాటు ఆనందాన్ని నింపదు. ముఖ్యంగా గర్భిణీలు ప్రయాణాల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో వారి ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో సాధారణంగానే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. గర్భిణీలు ఈ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తగా ఉండాలని అందుకే వైద్యులు పదే పదే సూచిస్తుంటారు. అయితే ప్రెగ్నెన్సి సమయంలో ప్రయాణించాలంటే అమ్మాయిలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అందువల్ల గర్భిణీ సుదీర్ఘ ప్రయాణానికి వెళ్లే ముందు ఈ కింది జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వైద్యుడిని సంప్రదించాలి

ప్రెగ్నెన్సి సమయంలో అమ్మాయిలు దూర ప్రయాణాలు చేసే ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వారికి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే లేదా రోజూ మందులు వాడుతుంటే.. ఇలాంటి వారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. తనిఖీ తర్వాత డాక్టర్ మీకు సరైన సలహా ఇస్తారు.

ఆహారంపై శ్రద్ధ

గర్భిణీలు ప్రయాణాలలో జంక్ ఫుడ్, వేయించిన, కారంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. అలాంటి ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు శుభ్రమైన నీళ్లు తాగాలి. అలాగే వీలైనంత వరకు కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా నిరోధించాలి.

ఇవి కూడా చదవండి

విరామం తీసుకోవాలి

ప్రయాణ సమయంలో అలసట చాలా సాధారణం. ముఖ్యంగా గర్భిణీలు సులువుగా అలసి పోతారు. కాబట్టి ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే తగినంత నిద్ర కూడా అవసరం. అలసట, నిద్ర లేకపోవడం మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. నిద్ర లేకపోవడం అలసట, ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

సౌకర్యవంతమైన సీట్లను ఎంచుకోవాలి

ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన సీటును ఎంచుకోవాలి. మీరు రైలులో ప్రయాణిస్తుంటే, వాష్‌రూమ్‌కు దగ్గరగా ఉన్న సీటును ఎంచుకోండి. ఎందుకంటే తరచుగా వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. ముఖ్యంగా కారులో ప్రయాణిస్తుంటే మాత్రం సీటు బెల్ట్ ధరించడం గుర్తుంచుకోవాలి.

అలాగే మీరు వెళ్లే ప్రదేశం వాతావరణం, ఆహారం, తాగునీటి గురించి ముందుగానే క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎక్కి దిగాల్సిన ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది. మీరు వెళ్లే ప్రదేశం చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులు, వైద్యుల గురించి కూడా సమాచారం ముందే సేకరించాలి. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఆ వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం చేయకూడదు.

ముఖ్యమైన మందులను వెంట తీసుకెళ్లాలి

గర్భధారణ సమయంలో ప్రయాణించేటప్పుడు మందులను ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లాలి. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రయాణ తేదీకి కొన్ని రోజుల ముందే వైద్యుడిని సందర్శించి, మీకు ఏదైనా సమస్య ఉంటే అతనికి తెలియజేయాలి. తద్వారా వైద్యులు మీకు అవసరమైన మందులను అందిస్తారు.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.