Aloe Vera for Hair: జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలంటే కలబందను ఇలా వాడండి..
కలబందతో కేవలం ఆరోగ్య సమస్యలే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. జుట్టు సమస్యలను దూరం చేయడంలో కలబంద ఎంతో చక్కగా పని చేస్తుంది. చుండ్రును తగ్గించడంలో, జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడంలో ఈ హెయిర్ ప్యాక్ వాడండి..
ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఎంత కేర్ తీసుకున్నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ముఖ్యంగా ఈ సమస్యను ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఫేస్ చేస్తూ ఉంటారు. జుట్టు కారణంగా చాలా ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. ఇప్పుటికే జుట్టుకు సంబంధించి ఎన్నో నివారణ చిట్కాలు తెలుసుకున్నాం. లేటెస్ట్‌గా ఇప్పుడు మీ కోసం మరో బెస్ట్ హోమ్ రెమిడీ తీసుకొచ్చాం. జుట్టు రాలిపోతుంది అనగానే చాలా మంది మార్కెట్లో లభించే ఎన్నో క్రిములను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటికి బదులు ఇంటి రెమిడీస్ పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలోవెరా, కొబ్బరి నూనెతో చేసే ఈ రెమిడీ పాటిస్తే.. చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తగ్గి.. జుట్టు పెరిగేందుకు చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఆలోవెరాతో చేసే ఆ రెమిడీ ఏంటి? ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు చూద్దాం.
అలోవెరా, కొబ్బరి నూనె:
అలోవెరా, కొబ్బరి నూనె రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి జుట్టు సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టును తేమగా, బలంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. చుండ్రుని తగ్గించి, జుట్టు రాలకుండా, చివర్లు చిట్లకుండా, జుట్టు సిల్కీగా అయ్యేలా చూస్తాయి. అంతే కాకుండా జుట్టును మెత్తగా, షైనీగా చేస్తాయి. మరి ఈ హెయిర్ ప్యాక్ ఎలా ఇప్పుడు చూద్దాం.
హెయిర్ ప్యాక్ ఎలా వాడాలి:
ఒక బౌల్‌లో అలోవెరా జెల్, కొబ్బరి నూనె, తేనె అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి. ఈ ప్యాక్‌ని ఓ గంట పాటు ఉంచి ఆరిపోయాక ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. అయితే అలర్జీ ఉంటే ఈ ప్యాక్‌ను వాడాలి. ఈ హెయిర్ ప్యాక్ ఫ్రిజ్‌లో నిల్వ కూడా చేసుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..