Tulsi Plant: తులసి మొక్క ఎండిపోకుండా.. ఏపుగా పెరగాలంటే ఈ టిప్స్ బెస్ట్!

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉండే ప్రత్యేకతే వేరు. తులసి మొక్కను దైవ స్వరూపంగా ఆరాధిస్తారు. ప్రతీ ఇంట్లో కూడా తులసి మొక్క అనేది ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. తులసి మొక్క నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీని వలన ఇంట్లో ఉండే గాలి పరిశుభ్రం అవుతుంది. అంతే కాకుండా తులసి ఆకులతో చాలా వరకు ఎన్నో సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించుకోవచ్చు. తులసి ఆకుల్ని తరచూ తీసుకుంటే ఉంటే శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ చాలా..

Tulsi Plant: తులసి మొక్క ఎండిపోకుండా.. ఏపుగా పెరగాలంటే ఈ టిప్స్ బెస్ట్!
Tulsi Palnt
Follow us

|

Updated on: Oct 08, 2024 | 1:33 PM

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉండే ప్రత్యేకతే వేరు. తులసి మొక్కను దైవ స్వరూపంగా ఆరాధిస్తారు. ప్రతీ ఇంట్లో కూడా తులసి మొక్క అనేది ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. తులసి మొక్క నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీని వలన ఇంట్లో ఉండే గాలి పరిశుభ్రం అవుతుంది. అంతే కాకుండా తులసి ఆకులతో చాలా వరకు ఎన్నో సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించుకోవచ్చు. తులసి ఆకుల్ని తరచూ తీసుకుంటే ఉంటే శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ చాలా బలపడుతుంది. రోగ నిరోధక శక్తి ఉండటం వల్ల ఎలాంటి వ్యాధులు అయినా సరే త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి. అయితే తులసి మొక్కలు అనేవి ఒక్కోసారి బ్రతకవు. ఎండిపోతూ ఉంటాయి. మొక్క ఎండిపోతుందని చాలా మంది పారేస్తూ ఉంటారు. కానీ కొన్ని రకాల టిప్స్ ఫాలో చేస్తే మొక్క ఎండిపోకుండా ఉంటుంది.

తులసి ఆకులు:

చాలా మంది తులసి ఆకుల్ని అలానే ఉంచేస్తూ ఉంటారు. ఇవి చెట్టుకు అనే ఉండి పండిపోయి పడిపోతాయి. ఇలా ఆకులు బాలేనప్పుడు, ఆకులు ఎండిపోతూ కనిపిస్తే వెంటనే వాటిని తీసి పారేయండి. దీని వలన మొక్క త్వరగా చనిపోకుండా ఉంటుంది.

నీళ్లు:

మొక్కలు నీళ్లు పోసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే నీళ్లు ఎక్కువైనా.. తక్కువైనా నష్టమే. కాబట్టి మట్టిని చూసుకుని నీళ్లు పోస్తూ ఉండాలి. తులసి మొక్కకు కూడా ఉదయం, సాయంత్రం కొద్దిగా నీళ్లు ఇవ్వాలి. దీని వలన మొక్క చక్కగా బ్రతుకుతుంది.

ఇవి కూడా చదవండి

వేప నూనె:

మొక్కలు తరచూ ఎండి పోతూ ఉన్నా, ఏదన్నా చీడ, పీడ ఎటాక్ చేసినా మొక్కలు త్వరగా ఎండిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి పట్టించుకుంటూ ఉండాలి. ఏదన్నా చీడ పీడ రాకుండా ఉండాలంటే.. వేప నూనె నీటిలో కలిపి మిక్స్ చేసి స్ప్రే చేయాలి. పసుపు కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది.

బియ్యం నీరు:

మొక్క చక్కగా ఏపుగా పెరగాలంటే బియ్యం నీరు కూడా వేస్తూ ఉండాలి. ఇలా బియ్యం నీరు వేయడం వల్ల తులసి మొక్క చక్కగా ఏపుగా పెరుగుతుంది. ఈ చిట్కా చక్కగా పని చేస్తుంది.

ఆవు పాలు:

ఆవు పాలు కూడా తులసి మొక్కకు వేయడం వల్ల తులసి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. నెలకు రెండు సార్లు ఈ ఆవు పాలు వేయడం వల్ల చక్కగా తులసి మొక్కల బ్రతుకుతుంది. అలాగే ఏపుగా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..