Kitchen Hacks: టమాటా తక్కువ ధర ఉన్నప్పుడే.. పౌడర్ చేసి నిల్వ చేసుకోండి.. తయారీ విధానం మీ కోసం

టమాటా ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఒక్కసారి కేవలం రూపాయికి కిలో టమాటా లభిస్తే.. మరికొన్ని సార్లు కిలో టమాటా రూ. 100లు అన్నా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలు సర్వసాధారణంగా మార్కెట్ లో చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ నేపధ్యంలో వంట ఇంట్లో టమాటా లేకపోతె అమ్మో ఎలా అనుకునే వారి కోసం సింపుల్ టిప్స్. తక్కువ ధర ఉన్న సమయంలో టమాటాలను ఖరీదు చేసి వాటితో టమాటా పౌడర్ ను తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు.

Kitchen Hacks: టమాటా తక్కువ ధర ఉన్నప్పుడే.. పౌడర్ చేసి నిల్వ చేసుకోండి.. తయారీ విధానం మీ కోసం
Tomato Powder
Follow us

|

Updated on: Oct 08, 2024 | 1:20 PM

ఒకానొక సమయంలో లవ్ యాపిల్ గా ఇంటి ముందు అందం కోసం పెంచుకునే టమాటాకు కురగాయాల్లో విశిష్ట స్థానం ఉంది. టమాటా లేకపోతే ఏ ఆహారం కూడా పూర్తి చేయరు. అయితే ఈ టమాటా ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఒక్కసారి కేవలం రూపాయికి కిలో టమాటా లభిస్తే.. మరికొన్ని సార్లు కిలో టమాటా రూ. 100లు అన్నా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలు సర్వసాధారణంగా మార్కెట్ లో చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ నేపధ్యంలో వంట ఇంట్లో టమాటా లేకపోతె అమ్మో ఎలా అనుకునే వారి కోసం సింపుల్ టిప్స్. తక్కువ ధర ఉన్న సమయంలో టమాటాలను ఖరీదు చేసి వాటితో టమాటా పౌడర్ ను తయారు చేసుకుని నిల్వ చేసుకుంటే టమాట ధర చుక్కలు తాకుతుంది కొనలేం అనుకునే సమయంలో ఈ టమాటో పౌడర్ ని ఉపయోగించి రుచికరమైన ఆహారం తయారు చేసుకోవచ్చు. ఈ రోజు ఇంట్లోనే టమోటా పొడిని తయారు చేయడం ఎలా అనే విషయం తెలుసుకుందాం..

ఇంట్లోనే టమాటా పౌడర్ తయారీ విధానం..

పండిన టొమాటోలను ఎంచుకోండి: మంచి టమాటా పొడర్ కావాలంటే.. పండిన, సువాసనగల టమోటాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా రోమా టొమాటోలను టమాటో పౌడర్ తయారీకి ఎంచుకోండి. ఎందుకంటే ఈ టమాటోలో తక్కువ తేమ ఉంటుంది. మంచి రుచికరంగా ఉంటాయి. టమాటా పౌడర్ తయారీలో ఈ రోమా టొమాటోను ఉపయోగించినా మీకు నచ్చిన రకాన్ని ఉపయోగించవచ్చు.

టొమాటోలను ఎలా సిద్ధం చేయాలంటే: ముందుగా టొమాటోలను బాగా కడగాలి. కాండం, టమాటాల మీద ఉన్న మచ్చలను తొలగించండి. అప్పుడు ఈ టమాటాలను తడి లేకుండా ఆరబెట్టండి. లేదా… తీసుకున్న టొమాటోలను వేడినీటిలో కొన్ని సెకన్ల పాటు బ్లాంచింగ్ చేసి.. అనంతరం ఆ టమాటాలను మంచు నీటిలో ముంచి తొక్కలను వదులుకోండి.

ఇవి కూడా చదవండి

టొమాటోలను డీహైడ్రేట్ చేయండి: తర్వాత టొమాటోలను సన్నగా, సమానంగా ముక్కలుగా చేసి వాటిని పార్చ్‌మెంట్ పేపర్‌తో చుట్టి డీహైడ్రేటర్ ట్రే లేదా బేకింగ్ షీట్‌లో ఒకే పొరలో అమర్చండి. డీహైడ్రేటర్‌ని ఉపయోగిస్తే.. పండ్లు లేదా కూరగాయలను ఎండబెట్టడం కోసం తయారీదారు సూచనలను అనుసరించండి. లేదా ప్రత్యామ్నాయంగా టమాటాలను ఎండ బెట్టి పొడిగా చేయాలనుకుంటే ఓవెన్ ను ఉపయోగించండి. డీహైడ్రేటర్ ట్రే లేదా బేకింగ్ షీట్‌లో పెట్టిన టమోటాలను ఓవెన్ లో పెట్టి.. పూర్తిగా పొడిగా, పెళుసుగా మారే వరకూ తక్కువ హీట్ లో (సుమారు 200 ° F లేదా 95 ° C) ఆరబెట్టండి.

పౌడర్‌గా ఎలా గ్రైండ్ చేయాలంటే: టమోటాలు పూర్తిగా డీహైడ్రేట్ అయిన తర్వాత.. వాటిని ఓవెన్ నుంచి తీసి నీడలో చల్లార బెట్టండి. ఇలా చల్లారిన టమాటాలను తీసుకుని బ్లెండర్ లో లేదా మసాలా గ్రైండర్‌లో వేసి పొడి అయ్యేలా గ్రైండ్ చేయండి. అంతే టమాటా పౌడర్ రెడీ.

ఎలా నిల్వ చేయాలంటే: తయారు చేసుకున్న టొమాటో పౌడర్‌ను గాలి చొరబడని కంటైనర్‌లో వేసి నిల్వ చేసుకోండి. అంటే టమాటా పౌడర్ ను గాజు సీసాలో వేసి సూర్యకాంతి తగలని విధంగా చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..