AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: స్టూడెంట్ కు టీచర్ విధించిన శిక్ష.. శాశ్వతంగా కాళ్లు పోగొట్టుకున్న బాలుడు..

చైనాలోని ఒక మిడిల్ స్కూల్‌లో వేసవి శిబిరంలో ఒక పిల్లవాడికి ఉపాధ్యాయుడు చాలా బాధాకరమైన శిక్ష విధించాడు. దీంతో ఆ స్టూడెంట్ దాదాపు మరణం అంచుకు వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఆ బాలుడు జీవితంలో తన కాళ్లమీద తాను నిలబడలేడు. ఈ షాకింగ్ కేసు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక మిడిల్ స్కూల్ లో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మిడిల్ స్కూల్ లో ఉపాధ్యాయుడు 13 ఏళ్ల స్టూడెంట్ కు వేసవి శిబిరంలో 1,000 సిట్-అప్‌లు చేయమని శిక్ష విధించాడు.

Viral News: స్టూడెంట్ కు టీచర్ విధించిన శిక్ష.. శాశ్వతంగా కాళ్లు పోగొట్టుకున్న బాలుడు..
China News
Surya Kala
|

Updated on: Oct 08, 2024 | 12:31 PM

Share

చదువులు, క్రమశిక్షణ విషయంలో ఉపాధ్యాయుల స్టూడెంట్స్ పట్ల కొంత కఠినత్వం తో ఉండడం పాఠశాలల్లో సర్వసాధారణం. చాలాసార్లు టీచర్లు పిల్లల్ని తిట్టడం ద్వారా, కొన్నిసార్లు కొట్టడం ద్వారా తప్పుఒప్పులను చెప్పడానికి ప్రయత్నిస్తారు. అయితే చైనాలోని ఒక మిడిల్ స్కూల్‌లో వేసవి శిబిరంలో ఒక పిల్లవాడికి ఉపాధ్యాయుడు చాలా బాధాకరమైన శిక్ష విధించాడు. దీంతో ఆ స్టూడెంట్ దాదాపు మరణం అంచుకు వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఆ బాలుడు జీవితంలో తన కాళ్లమీద తాను నిలబడలేడు.

ఈ షాకింగ్ కేసు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక మిడిల్ స్కూల్ లో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మిడిల్ స్కూల్ లో ఉపాధ్యాయుడు 13 ఏళ్ల స్టూడెంట్ కు వేసవి శిబిరంలో 1,000 సిట్-అప్‌లు చేయమని శిక్ష విధించాడు. ఆడిటీ సెంట్రల్ నివేదిక ప్రకారం 200 సిట్-అప్‌లు చేసిన తర్వాత.. ఆ పిల్లవాడు నొప్పులతో ఇబ్బంది పడడం మొదలు పెట్టాడు. అయినప్పటికీ ఉపాధ్యాయుడు పశ్చాత్తాపం చెందలేదు. స్టూడెంట్ కు తాను విధించిన శిక్షను రద్దు చేయలేదు. పైగా గుంజీలు తీయమంటూ ఆ స్టూడెంట్ ని వేధించడం కొనసాగించాడు.

టీచర్ విధించిన శిక్ష కారణంగా స్టూడెంట్ కాలులో భరించలేని నొప్పి వచ్చిందట. మొదట కండరాల నొప్పిగా భావించి ఆ బాలుడికి మందులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎన్ని మందులు తీసుకున్నా బాలుడి నొప్పి ఉపశమనం లేదు. తరువాత వైద్యులు ఆ పిల్లవాడు అధిక శారీరక వ్యాయామం వల్ల వచ్చే రాబ్డోమియోలిసిస్ అనే తీవ్రమైన వ్యాధికి గురైనట్లు వెల్లడించారు. ఇది కండరాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అంతేకాదు కాలేయం, మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫలితంగా ఉపాధ్యాయుడి కఠినత్వం వల్ల విద్యార్థి శాశ్వత వికలాంగుడిగా మారాడు. ఆ బాలుడు జీవితాంతం కాళ్ల మీద నిలబడలేడు. ఈ ఘటన ఆ చిన్నారికి శారీరకంగా హానిని కలిగించడమే కాదు.. మానసికంగా కూడా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులు శిబిరం నిర్వాహకులపై కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

ఈ సంఘటన క్రమశిక్షణ, పిల్లల భద్రత పేరుతో ఉపాధ్యాయులు విధించే శిక్షల పరిమితుల గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ప్రతి సందర్భంలో పిల్లల భద్రత, శ్రేయస్సు అత్యంత ముఖ్యమైనదిగా ఉండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..