Konaseema: నేడు మహాలక్ష్మిగా వాసవీ కన్యకాపరమేశ్వరి.. 3.33 కోట్ల కరెన్సీతో అలంకరణ

కోనసీమ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమలాపురం లో శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి దేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ అదరహో అనిపిస్తుంది. మూడు కోట్ల 33 లక్షల తో అమ్మవారిని అలంకరించారు ఆలయ నిర్వాహకులు. అమ్మవారి ముఖ మండపంతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం కరెన్సీ నోట్లతో నోట్లతో అలంకరణ ధగధగ లాడుతుంది.

Konaseema: నేడు మహాలక్ష్మిగా వాసవీ కన్యకాపరమేశ్వరి.. 3.33 కోట్ల కరెన్సీతో అలంకరణ
Vasavi Kanyaka Parameswary
Follow us
Surya Kala

|

Updated on: Oct 08, 2024 | 10:27 AM

కోనసీమ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమలాపురం లో శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి దేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ అదరహో అనిపిస్తుంది. మూడు కోట్ల 33 లక్షల తో అమ్మవారిని అలంకరించారు ఆలయ నిర్వాహకులు. అమ్మవారి ముఖ మండపంతో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం కరెన్సీ నోట్లతో నోట్లతో అలంకరణ ధగధగ లాడుతుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ రోజు ఒక విశేషమైన అలంకరణ తో ఇక్కడి వాసవీ మాత భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

కరెన్సీ అమ్మవారుగా ఉన్న వాసవీ మాతని దర్శించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి కాకుండా దూరప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నేడు మహాలక్ష్మి దేవి అలంకరణ కావడంతో డబ్బులతో (కరెన్సితో) అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఇదే విధంగా అలంకరణ చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..