Navaratri 2024: మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. రేపు మూలా నక్షత్రం.. సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం చంద్రబాబు

ఇంద్రకీలాద్రి పై కొలువైన కనక దుర్గాదేవి  నేడు మహా లక్ష్మి దేవి అలంకారం లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మలగన్న అన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మని దర్శించుకునేందుకు తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులు బారులు దీరారు. మహాలక్ష్మిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనాలు  ప్రారంభమయ్యాయి. 

Navaratri 2024: మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. రేపు మూలా నక్షత్రం.. సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం చంద్రబాబు
Mahalakshmi Devi As Durgamma
Follow us
Surya Kala

|

Updated on: Oct 08, 2024 | 8:33 AM

దసర నవరాత్రి ఉత్సవాలు ఆరో రోజుకు చేరాయి.  ఈ రోజు మంగళవారం మంగళకరంగా దుర్గాదేవి కాత్యాయనీ దేవీ అవతారంలో దర్శనం ఇస్తోంది. అదే సమయంలో ఇంద్రకీలాద్రి పై కొలువైన కనక దుర్గాదేవి  నేడు మహా లక్ష్మి దేవి అలంకారం లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మలగన్న అన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మని దర్శించుకునేందుకు తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులు బారులు దీరారు. మహాలక్ష్మిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనాలు  ప్రారంభమయ్యాయి.

ఇక నవరాత్రులలో ఏడవ రోజు అక్టోబర్ 9 బుధవారం ముఖ్యమైన మూల నక్షత్రం.. దుర్గాదేవి మూల నక్షత్రంలో సరస్వతి దేవి అలంకారం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నది దుర్గమ్మ. రేపు మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య ప్రభుత్వం తరపున సిఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి కొండపైకి  చంద్రబాబు భువనేశ్వరి దంపతులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..