AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. చక్కటి ఆరోగ్యం, మెరిసే అందం మీ వెంటే..!

శతాబ్ధాల కాలం నుంచి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాల చికిత్సలకు మెడిసిన్‌గా వాడుతున్నారు. ఇవన్నీ మన శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో కొన్నింటిని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అలాంటి ఆయుర్వేద ఔషధ మొక్కలు వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. చక్కటి ఆరోగ్యం, మెరిసే అందం మీ వెంటే..!
Medicinal Plants
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2025 | 2:24 PM

Share

ప్రకృతిలో లభించే అనేక రకాల మొక్కలు, చెట్లు ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయి. శతాబ్ధాల కాలం నుంచి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాల చికిత్సలకు మెడిసిన్‌గా వాడుతున్నారు. ఇవన్నీ మన శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో కొన్నింటిని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అలాంటి ఆయుర్వేద ఔషధ మొక్కలు వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

పుదీనా:  పుదీనా ఆకులు.. వీటి వాసన చూస్తేనే మూడ్‌ అంతా రిఫ్రెష్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. వంటల్లోనూ మంచి రుచి, వాసన అందించడానికి పుదీనాను వాడుతుంటారు. పుదీనా వంటల టేస్ట్‌ పెంచడానికే కాదు.. మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొన్ని పుదీనా ఆకులు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీ, సాస్, స్వీట్లు మొదలైన వాటికి రుచి, సువాసన కోసం దీన్ని కలుపుతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఉబ్బరం తగ్గిస్తుంది.

కరివేపాకు: పప్పు, సాంబారు వంటి అన్ని వంటకాల్లో కరివేపాకు వాడతారు. కరివేపాకు ఆకులలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, పీచు పోషకాలతోపాటు విటమిన్‌-సి, విటమిన్‌-బి, విటమిన్‌-ఇలు అధికం. రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలు పొందుతారు. మధుమేహులకు ఇది సరైన ఆహారం. నాడీసంబంధిత వ్యాధుల్నీ, క్యాన్సర్లనీ అడ్డుకుంటుందట. ఇందులో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

లెమన్ గ్రాస్: సువాసనతో కూడిన మొక్క లెమన్ గ్రాస్. దీన్ని టీ, సూప్, థాయ్ వంటకాల్లో వాడతారు. ఈ మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్. ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా నుండి శరీరాన్ని రక్షిస్తుంది. లెమన్ గ్రాస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌‌ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది. ఈ లెమన్ గ్రాస్‌లో అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. వ్యాధులు, రోగాలతో పోరాడే శక్తిని ఇస్తాయి.

గిలోయ్: రోగనిరోధక శక్తిని పెంచే గుణాలకు ప్రసిద్ధి చెందినది గిలోయ్. ఇది శరీర ఉష్టోగ్రతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తిప్పతీగ లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. తిప్పతీగ ఆకులను రోజుకు రెండు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా పెంచి ఎక్కువ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. డయాబెటిక్ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

తులసి: హిందూ మతంలో తులసికి ప్రత్యేక ప్రముఖ్యత ఉంటుంది. వారిలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి ముంగిట తులసి చెట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ తులసి చెట్టుకు నీరు పోసి ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే, తులసి మొక్క కేవలం మతపరమైన ప్రాముఖ్యతలకు మాత్రమే కాదు..పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. తులసికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దగ్గును తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..