AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తరచుగా విద్యుత్ కోతలు జరుగుతుంటే ప్రిడ్జ్ లో ఈ వస్తువులు పొరపాటున కూడా పెట్టవద్దు.. ఎందుకంటే

వేసవి వచ్చిదంటే చాలు చాలా ప్రాంతాల్లో తరచుగా విద్యుత్ కోతలు జరుగుతూ ఉంటాయి. ఇలా విద్యుత్ కోత ఉండే ప్రదేశంలో ఎవరైనా నివసిస్తుంటే.. ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. తరచుగా విద్యుత్ కోతల కారణంగా, రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. అందువలన ఫ్రిడ్జ్ లో పెట్టిన కొన్ని రకాల వస్తువులు చెడిపోతాయి. కనుక తరచుగా కరెంటు పోయినప్పుడు రిఫ్రిజిరేటర్‌లో ఏ వస్తువులను నిల్వ చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం?

తరచుగా విద్యుత్ కోతలు జరుగుతుంటే ప్రిడ్జ్ లో ఈ వస్తువులు పొరపాటున కూడా పెట్టవద్దు.. ఎందుకంటే
Power Outages And Food Safety
Surya Kala
|

Updated on: May 28, 2025 | 8:56 PM

Share

మన ఇళ్లలో మనం రోజువారీ అవసరాలకు పూర్తిగా ఆధారపడే వాటిలో రిఫ్రిజిరేటర్ ఒకటి. అది మిగిలిపోయిన ఆహారం కావచ్చు, పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కావచ్చు లేదా కూరగాయలు, పండ్లు కావచ్చు. మనం రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం ద్వారా ప్రతిదీ చాలా కాలం పాటు సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తాము. అయితే ఎవరైనా తరచుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయే ప్రాంతంలో నివసిస్తుంటే.. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

తరచుగా విద్యుత్ కోతల కారణంగా.. రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. దీని కారణంగా రిఫ్రిజిరేటర్ లోపల ఉంచిన వస్తువులు త్వరగా చెడిపోతాయి. కరెంటు వస్తూ పోతూ ఉంటే.. రిఫ్రిజిరేటర్ పదే పదే చల్లగా, వేడిగా మారుతుంది. దీని కారణంగా కొన్ని ఆహార పదార్ధాలు త్వరగా కుళ్ళిపోవడం ప్రారంభమవుతాయి. వాటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. అపుడు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఒకొక్కసారి ఇతర తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. కనుక పదే పదే కరెంటు పోతుంటే.. మీరు ఏ వస్తువులను ఫ్రిజ్‌లో ఉంచకూడదో తెలుసుకుందాం.

పాలు, పాల ఉత్పత్తులు పాలు, పెరుగు, జున్ను , పాల క్రీమ్ వంటి పాల ఉత్పత్తులు చాలా త్వరగా చెడిపోతాయి. రిఫ్రిజిరేటర్ తగినంత చల్లగా లేనప్పుడు.. ఈ వస్తువులలో బ్యాక్టీరియా చాలా త్వరగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో వీటిని తినడం వలన కడుపు నొప్పి, వాంతులు-విరేచనాలు లేదా ఫుడ్ పాయిజనింగ్ సంభవించవచ్చు.

ఇవి కూడా చదవండి

వండిన ఆహారం వండిన ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత లేకుండా ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే.. వంట చేసిన ఆహారం త్వరగా పాడైపోతుంది. ఆహారం రంగు, రుచి, వాసన మారి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు. ముఖ్యంగా పప్పు, కూరలు, అన్నం, గ్రేవీ వస్తువులు ఇలా కరెంట్ వస్తూ పోతూ ఉంటే అవి త్వరగా చెడిపోతాయి.

పచ్చి మాంసం, చేపలు మాంసం, చేపలు ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులను తట్టుకోలేని ఆహార పదార్థాలు. ఇవి చాలా త్వరగా చెడిపోతాయి, సాల్మొనెల్లా లేదా ఇ. కోలి వంటి హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు. సరైన విద్యుత్ అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే పచ్చి మాంసం, చేపలను ఫ్రిజ్‌లో ఉంచండి.

గుడ్లు గది ఉష్ణోగ్రత వద్ద కూడా గుడ్లు కొంతకాలం సురక్షితంగా ఉంటాయి. అయితే గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసినప్పుడు.. ప్రిడ్జ్ పదే పదే వేడిగా , చల్లగా మారుతూ ఉంటే, గుడ్ల ఉపరితలంపై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇది గుడ్ల లోపల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

తరిగిన పండ్లు, కూరగాయలు పండ్లు, కూరగాయలను కోసిన తర్వాత..వాటి తాజాదనం త్వరగా అయిపోతుంది. వీటిని రిఫ్రిజిరేటర్‌లో సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచకపోతే.. అవి త్వరగా కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. కోసిన టమోటాలు, కీర దోసకాయ, మామిడి పండ్లు, పుచ్చకాయలు వంటివి చాలా త్వరగా చెడిపోతాయి. వాటికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)