Bread gulab jamun: స్వీట్ తినాలనిపిస్తే నిమిషాల్లో బ్రెడ్ గులాబ్ జామున్ చేయండి.. ఒకటికి రెండు లాగించేస్తారు
గులాబ్ జామున్ అనేది భారత దేశంలో మాత్రమే కాదు, పాకిస్తాన్ , నేపాల్ , మాల్దీవులు మరియు బంగ్లాదేశ్‌తో పాటు పశ్చిమ ఆసియా ప్రాంతాలలో పాపులర్ అయిన ఒక తీపి పదార్థం. ఈ స్వీట్ ను సర్వసాధారణంగా పనీర్, మైదా పిండి, పంచదారతో తయారు చేస్తారు. ఈ గులాబ్ జామున్ తినడానికి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. అయితే ఎప్పుడైనా స్వీట్ తినలనిపిస్తే అప్పటికప్పుడు బ్రెడ్ తో మార్కెట్ లో దొరకే రుచితో గులాబ్ జామున్ తయారు చేసుకోవచ్చు. ఈ రోజు బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేయడం ఎలా తెలుసుకుందాం..

గులాబ్ జామూన్ చక్కెర, రోజ్ వాటర్ , యాలకుల పొడితో తయారు చేసే ఒక క్లాసిక్ ఇండియన్ స్వీట్. ఇది చాలా ప్రసిద్ధ భారతీయ డెజర్ట్. పండుగలు, వేడుకల్లో నైనా గులాబ్ జామున్ ఉండాల్సిందే. అయితే ఈ గులాబ్ జామున్ ని బ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు అని తెలుసా.. ఎవరైనా సర్వసాధారణంగా బ్రెడ్ తో టోస్ట్ , బ్రెడ్ పకోడా లతో పాటు డబుల్ కా మీటా, రసమలై , బర్ఫీ వంటి అనేక రకాల రుచికరమైన స్వీట్లు కూడా తయారు చేస్తారు. అయితే బ్రెడ్ తో తక్కువ సమయంలోనే రుచికరమైన గులాబ్ జామున్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా.. ఈ రోజు మనం బ్రెడ్ తో గులాబ్ జామున్ తయారు చేసే పద్ధతి గురించి తెలుసుకుందాం.. దీనిని తక్కువ పదార్ధాలతోనే తక్కువ తయారు చేసుకోవచ్చు.
బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేయడానికి కావలసిన పదార్ధాలు
బ్రెడ్ ముక్కలు – 5
మైదా – 2 టీస్పూన్లు
పాలు – 1 కప్పు
చక్కెర – 1 కప్పు (సిరప్ కోసం)
యాలకుల పొడి – 1 టీస్పూన్
నీరు – అవసరమైనంత
కుంకుమ పువ్వు రేకలు – మూడు
నెయ్యి – రెండు స్పూన్లు
నూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం: ముందుగా బ్రెడ్ ముక్కల సైడ్ కట్ చేసి మధ్యలో బ్రెడ్ ను ముక్కలు చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పాలు, మైదా పిండి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు పక్కకు పెట్టండి. తరవాత ఈ మిశ్రమాన్ని తీసుకుని చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా గుండ్రంగా చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి.. నూనె వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న బ్రెడ్ మిశ్రమం ఉండలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి బయటకు తీసి ఒక గిన్నె వేసుకోండి. ఇంతలో ఒక పాత్రని స్టవ్ మీద పెట్టి 1 కప్పు నీరు వేడి చేసి, చక్కెర, యాలకుల పొడి, కుంకుమపువ్వు రేకలు వేసి బాగా పంచదార కరిగే వరకూ నీటిని మరిగించాలి. సిరప్ సరిగ్గా తయారైన తర్వాత.. స్టవ్ ఆపి.. ఇప్పుడు అందులో రెడీ చేసుకున్న గులాబ్ జామున్ వేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. సిరప్ పీల్చుకున్న తర్వాత బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ. మెత్తగా నోట్లో పెటుకుంటే కరిగిపోయే ఈ బ్రెడ్ గులాబ్ జామున్ ను ఎవరినా సరే తింటే వావ్ అనాల్సిందే.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




