Weight Loss Diet: ఎంత ట్రై చేసిన బరువు తగ్గలేకపోతున్నారా..? ఓ సారి ఈ రైస్ ట్రై చేయండి..!
బియ్యం తింటే బరువు పెరుగుతారని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ కొన్ని రకాల బియ్యం శరీరానికి మంచి చేస్తాయి. బరువు తగ్గడానికి కూడా తోడ్పడతాయి. అటువంటి వాటిలో బ్లాక్ రైస్ ముందు ఉంటుంది. ఇది పోషకాలు నిండిన ఆహారం. ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ తో బ్లాక్ రైస్ ఒక సూపర్ ఫుడ్ గా గుర్తింపు పొందింది.

బ్లాక్ రైస్ ను ఫర్బిడెన్ రైస్ అని కూడా అంటారు. పూర్వం చైనాలో రాజులకు మాత్రమే ఈ బియ్యాన్ని ప్రత్యేకంగా అందించేవారు. ఎందుకంటే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా ప్రొటీన్లు, ఐరన్, ఫైబర్, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు.
బ్లాక్ రైస్ ను రోజూ ఆహారంగా తీసుకోవచ్చు. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా కలిగి ఉండటం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించగలదు. డయాబెటిస్ ఉన్నవారు కూడా పరిమితంగా తినవచ్చు. దీనిని రోజూ దాల్చిన చెక్క, కరివేపాకు వంటి సహజ వాసనలతో కలిపి వండితే రుచికి, ఆరోగ్యానికి రెండింటికీ మంచి చేస్తుంది.
బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా ఆంథోసైనిన్స్ అనే పదార్థాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె సంబంధిత సమస్యలు రాకుండా బ్లాక్ రైస్ ఉపయోగపడుతుంది.
బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇవి కంటి ముడుతలు, నల్ల మచ్చలు వంటి సమస్యల నుండి రక్షణ కలిగిస్తాయి. దీర్ఘకాలం దీనిని తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.
బ్లాక్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తిన్న వెంటనే కడుపు నిండిన భావన వస్తుంది. ఎక్కువ కాలం ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో అనవసరంగా మళ్ళీ మళ్ళీ తినే అలవాట్లను నియంత్రించవచ్చు. ఇది బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించి కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.
బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ను తగ్గిస్తాయి. ఇవి క్యాన్సర్, మానసిక అలసట, వృద్ధాప్యం వంటి సమస్యల ప్రభావాన్ని తగ్గించగలవు. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
బ్లాక్ రైస్ ఆరోగ్యానికి మేలు చేసే ప్రత్యేకమైన ఆహారం. దీనిని ఆహారంలో చేర్చుకుంటే.. గుండె ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, బరువు తగ్గడం, శక్తివంతమైన రోగ నిరోధక వ్యవస్థ లాంటి అనేక లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు దీనిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




