AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Improve Memory: జ్ఞాపకశక్తిని పెంచే జపనీస్ సీక్రెట్ టెక్నిక్‌ లు మీకోసం..!

మన జ్ఞాపక శక్తి బలపడాలంటే జపనీయుల పద్ధతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వారు శతాబ్దాలుగా పాటిస్తున్న కొన్ని సులభమైన టెక్నిక్‌ లు మన మెదడు ను చురుగ్గా ఉంచుతాయి. మనం మరిచిపోతున్న విషయాలను గుర్తుంచుకునే శక్తిని పెంచడంలో ఇవి చాలా సహాయపడుతాయి.

Improve Memory: జ్ఞాపకశక్తిని పెంచే జపనీస్ సీక్రెట్ టెక్నిక్‌ లు మీకోసం..!
Memory Strengthening
Prashanthi V
|

Updated on: May 28, 2025 | 9:17 PM

Share

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఏం చేయాలో గుర్తుండదు. చేద్దాం అని అనుకుంటూనే చేయాల్సిన పనులు మర్చిపోతుంటారు. ఇవి మామూలు విషయాలే అయినా.. మన మెదడును చురుగ్గా ఉంచాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా జపాన్ నుంచే కొన్ని విశేషమైన జ్ఞాపకశక్తిని పెంచే పద్ధతులు వచ్చాయి. ఈ జపనీస్ చిట్కాల వల్ల మన మెదడు మరింత చురుకుగా మారి, విషయాలు మర్చిపోకుండా గుర్తుంచుకునే శక్తిని పొందుతుంది. ఆ చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కన్ సాట్సూ

ఈ పద్ధతిని జపాన్‌లో సన్యాసులు, కళాకారులు ఎక్కువగా పాటిస్తారు. కన్ సాట్సూ అంటే చుట్టూ ఉన్న విషయాలను నిశ్శబ్దంగా గమనించడం. మనం ఏమీ మాట్లాడకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తే మెదడు సానుకూలంగా స్పందిస్తుంది. అన్ని విషయాలను శ్రద్ధగా గుర్తుంచుకుంటుంది. ఇది కళలతో సంబంధం ఉన్న వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒక రకమైన మైండ్‌ ఫుల్ నెస్ టెక్నిక్.

శిసా కాన్కో

శిసా కాన్కో అంటే ఒక విషయాన్ని చూపిస్తూ బిగ్గరగా మాట్లాడటం. అంటే శరీరానికి, మెదడుకి కలిపి పని చేసేలా మాటలు చెప్పడం. దీని వల్ల మన దృష్టి పూర్తి స్థాయిలో ఆ విషయంపైనే ఉంటుంది. జపాన్‌ లో రైలు నడిపే ఆపరేటర్లు ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తుంటారు.

నైకాన్

కాలం గడిచే కొద్దీ మన జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని అనుకుంటాం. అయితే జపనీయులు నైకాన్ అనే విధానాన్ని పాటిస్తూ.. మౌనంగా ఉండటం ద్వారా పాత జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రశాంత వాతావరణంలో కూర్చొని నేను ఎవరికీ ఏం ఇచ్చాను..? ఎవరి నుంచి ఏం తీసుకున్నాను..? ఎవరి వల్ల నాకు ఇబ్బంది కలిగింది..? వంటి ప్రశ్నలను మనలో మనం వేసుకుంటే పాత జ్ఞాపకాలు తిరిగి గుర్తొస్తాయని వారు చెబుతున్నారు.

చిసోకు

చిసోకు అనే ఈ పద్ధతిలో మనం నిరంతరం లక్ష్యాలవైపు పరుగులు పెట్టడం వల్ల వర్తమానాన్ని మర్చిపోతున్నామని చెబుతారు. మనకు ఉన్నది ఈ క్షణమే. దానిపైనే పూర్తిగా దృష్టి పెడితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అంటే భవిష్యత్‌ గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుతం ఉన్న పనిపై దృష్టి పెట్టాలి. ఇది మన మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది.

గ్యో

గ్యో అంటే ఒకే పనిలో పూర్తిగా ఏకాగ్రతతో నిమగ్నం కావడం. ఉదాహరణకు ఇల్లు శుభ్రం చేయడం, వస్తువులను క్రమబద్ధంగా సర్దడం లాంటి సాధారణ పనులే అయినా.. అవి మన మనసును స్థిరంగా ఉంచుతాయి. దీని వల్ల మన మెదడు దృఢంగా పని చేస్తుంది. తత్ఫలితంగా జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది.

కొటోడమా

జపనీయులు విశ్వసించే మరో శక్తివంతమైన టెక్నిక్ కొటోడమా. ఇది ఒక పదం లేదా వాక్యాన్ని పదే పదే పునరావృతం చేయడం. దీని వల్ల ఆ పదం మన మెదడులో నిలిచిపోతుంది. విద్యార్థులు లేదా ప్రసంగం ఇచ్చే వ్యక్తులు ఈ పద్ధతిని వాడితే జ్ఞాపకం బలపడుతుంది.

ఉకెటమో

ఉకెటమో అనే ఈ భావన టొహౌకు అనే జపనీస్ మతపరమైన వర్గం నుండి వచ్చింది. దీని అర్థం నిజాయితీగా అంగీకరిస్తాను. మనం ఏ అంశాన్నైనా హృదయపూర్వకంగా అంగీకరిస్తే మానసికంగా స్థిరంగా ఉండగలమని అప్పుడు మన భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయని ఇది చెబుతోంది.

మన జ్ఞాపకశక్తి బలపడాలని మర్చిపోవడాన్ని తగ్గించాలని అనుకుంటే జపనీయులు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ చిట్కాలను అనుసరించవచ్చు. ఇవి ఖచ్చితంగా మీ మెదడును చురుగ్గా ఉంచి మీరు మరిచిపోతున్న విషయాలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. ప్రయత్నించి చూడండి.. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.