Premature Skin Aging: మిమ్మల్ని వేగంగా వృద్ధాప్యంలోకి నెట్టే అలవాట్లు ఇవే.. వెంటనే మానేయండి!
పుట్టిన వారంతా ఒక వయసు వచ్చాక వృద్ధులుగా మారడం సహజం. అయితే కొంతమంది ఎంత పెద్దవారైనా నిత్యం యవ్వనంగా కనిపిస్తారు. కానీ ఇంకొంతమంది మాత్రం చిన్న వయసులోనే 40, 50 ఏళ్లలో ఉన్నట్లు కనిపిస్తారు. రోజువారీ జీవితంలోని కొన్ని అలవాట్లే ఈ అకాల వృద్ధాప్యానికి ప్రధాన కారణం. రోజువారీ జీవితంలోని కొన్ని అలవాట్లు చాలా ప్రమాదకరమైనవి..

పుట్టిన వారంతా ఒక వయసు వచ్చాక వృద్ధులుగా మారడం సహజం. అయితే కొంతమంది ఎంత పెద్దవారైనా నిత్యం యవ్వనంగా కనిపిస్తారు. కానీ ఇంకొంతమంది మాత్రం చిన్న వయసులోనే 40, 50 ఏళ్లలో ఉన్నట్లు కనిపిస్తారు. రోజువారీ జీవితంలోని కొన్ని అలవాట్లే ఈ అకాల వృద్ధాప్యానికి ప్రధాన కారణం. రోజువారీ జీవితంలోని కొన్ని అలవాట్లు చాలా ప్రమాదకరమైనవి. అవి మీ వాస్తవ వయస్సు కంటే పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి ఆ అలవాట్లను వెంటనే మానేయడం మంచిది. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
నిరంతర ఒత్తిడి
నిరంతర ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు, దాని ప్రభావాలు ముఖంపై కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఒత్తిడి మీ చర్మాన్ని అలసిపోయేలా చేసి, అకాల వృద్ధాప్యానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
రాత్రిపూట ఆలస్యంగా నిద్ర పోవటం
నిద్ర లేకపోవడం వల్ల దాని ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. అందువల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.
జంక్ ఫుడ్, స్వీట్లు అధికంగా తీసుకోవడం
మీరు ఎక్కువగా స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే దాని ప్రత్యక్ష ప్రభావం మీ ముఖంపై కనిపిస్తుంది. చక్కెర చర్మం వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. అందువల్ల పుష్కలంగా కూరగాయలు, పండ్లు తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
సన్‌స్క్రీన్ అప్లై చేయకపోవడం
చాలా మంది ఇంట్లో ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేయరు. UV కిరణాలు ఇంటి లోపల కూడా మన చర్మాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల, వాతావరణం ఎలా ఉన్నా, ప్రతిరోజూ మీ ముఖానికి సన్‌స్క్రీన్ అప్లై చేయడం ముఖ్యం.
ధూమపానం, మద్యం సేవించడం
అతిగా ధూమపానం, మద్యం సేవించడం కూడా అకాల వృద్ధాప్యానికి ప్రధాన కారణాలు. కాబట్టి ఈ చెడు అలవాట్లను మానేయడం చర్మానికి, ఆరోగ్యానికి చాలా మంచిది.
డీహైడ్రేషన్
తగినంత నీళ్లు తాగకపోవడం కూడా వృద్ధాప్యానికి ఒక కారణమే. నీళ్లు తగినంత లేకపోవడం వల్ల చర్మం తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిగా, నీరసంగా కనిపిస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








