Atibala plant: ఈ ఆకులు ఎక్కడ కనిపించినా వెంటనే తెంపుకోండి.. ఎందుకంటే..
రోడ్డు పక్కన కనిపించే మొక్కల్లో అతిబల ఒకటి. ఎలాంటి ఎరువులు, సంరక్షణ లేకుండా గాలికి పెరిగే ఈ మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా.? ఇంతకీ ఈ మొక్కతో ఎలాంటి లాభాలు ఉంటాయి.? ఈ మొక్కను ఎలా తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది. వాటిని గుర్తించి ఉపయోగించుకోవాలే కానీ ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాంటి వాటిలో ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆకులు ఒకటి. అతిబల మొక్క.. రోడ్ల పక్కన, గ్రౌండ్స్‌లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. దీని ఆకులు, పువ్వులు, కాండం, వేళ్లు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మొక్క ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇక నోటి దుర్వాసన నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. చిగుళ్ల వాపు నుంచి బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఇక శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అతిబల ఆకుల డికాషన్‌లో ద్రాక్ష పండ్లు, చక్కెర వంటివి కలిపి తీసుకోవడం వల్ల కఫంతో కూడిన దగ్గు తగ్గుతుంది. చిన్నారులకు వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా అతిబల ఉపయోగపడుతుంది. ఈ ఆకులను నీళ్లలో వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిలో కాస్త బెల్లం కలపాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చిన్నారులకు ఇస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
విరేచనాలు, మూత్రంలో రక్తం పడే సమస్య ఉన్న వారికి అతిబల మొక్క వేర్లు ఉపయోగపడతాయి. వేళ్లతో తయారు చేసిన కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగుతుంటే సమస్యలన్నీ బలదూర్ అవుతాయి. కడుపు నొప్పికి కూడా భలే ఉపయోగపడుతుంది. అతిబల, పృష్ణపర్ణి, కటేరి, లఖ్, శొంఠి వేసి పాలలో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. అతిబలం విత్తనాలను తీసుకున్నా ప్రయోజకరం ఉంటుంది. ఇక నీరసంగా ఉంటే అతిబల విత్తనాలను ఉడికించి తింటుండాలి. దీంతో నీరసం తగ్గి శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి.