Heart: కాళ్లలో ఈ మార్పులా.? గుండెపోటు వచ్చే అవకాశాలున్నటే..

సాధారణంగా గుండె పోటు వచ్చే వారిలో కనిపించే ముందస్తు లక్షణాల్లో ఛాతిలో మంట, ఎడమ చేతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కాళ్లలో కనిపించే కొన్ని లక్షణాలు కూడా గుండెపోటు వచ్చేందుకు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు రావడానికి ముందు కాళ్లలో కొన్ని మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు....

Heart: కాళ్లలో ఈ మార్పులా.? గుండెపోటు వచ్చే అవకాశాలున్నటే..
Heart Diseases
Follow us

|

Updated on: Jul 09, 2024 | 12:10 PM

ఇటీవల గుండె పోటు బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండె పోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ పూర్తిగా తగ్గడం కారణాల వల్ల గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. అయితే గుండెపోటును ముందుగా గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా గుండెపోటును గుర్తించవచ్చని అంటున్నారు.

సాధారణంగా గుండె పోటు వచ్చే వారిలో కనిపించే ముందస్తు లక్షణాల్లో ఛాతిలో మంట, ఎడమ చేతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కాళ్లలో కనిపించే కొన్ని లక్షణాలు కూడా గుండెపోటు వచ్చేందుకు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు రావడానికి ముందు కాళ్లలో కొన్ని మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎలాంటి కారణం లేకుండా కాళ్లు నిరంతరం నొప్పులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా రాత్రిపూట విపరీతమైన కాళ్ల నొప్పి ఉంటే గుండె సమస్యలకు ముందస్తు లక్షణంగా భావించాలి. దీనికి కారణం కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* పాదాల రంగులో మార్పు కూడా గుండె సమస్యలకు లక్షణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా కాళ్లు పసుపు లేదా నీలం రంగులోకి మారితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీనికి కూడా రక్త ప్రసరణ సమస్యలే కారణంగా చెప్పొచ్చు.

* ఇక కాళ్లకు గాయాలై త్వరగా తగ్గకపోతే సహజంగా మనం డయాబెటిస్‌ వ్యాధి లక్షణంగా భావిస్తాం. అయితే రక్త ప్రసరణ సమస్యల గాయాలు త్వరగా తగ్గవని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా గుండె సంబంధిత సమస్యలకు సంకేతం కావొచ్చు.

* కాళ్లపై ఉండే వెంట్రుకలు ఊడిపోవడం కూడా.. శరీరంలో అన్ని భాగాలకు తగినంత రక్తం చేరడం లేదని అర్థం చేసుకోవాలి. గుండె పనితీరు మందగించడం వల్ల ఈ సమస్య రావొచ్చు.

* కాలి గోళ్లు నెమ్మదిగా పెరుగుతున్నా.? గోళ్ల రంగు అనూహ్యంగా మారినా వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఇది కూడా రక్త ప్రసరణ సమస్యకు కారణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: కొన్ని సందర్భాల్లో పైన తెలిపిన లక్షణాలు కనిపించినా గుండె వ్యాధులకు సంకేతం కాకపోవచ్చు. అయితే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..