Breast Cancer at Men’s: పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. లక్షణాలు, కారణాలు ఇవే!
రొమ్ము క్యాన్సర్ గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ రొమ్ము క్యాన్సర్ ముఖ్యంగా మహిళల్లోనే కనిపిస్తుంది. ఈ క్యాన్సర్ చివరి దశలోనే గుర్తించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అందుకే అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. రొమ్ము క్యాన్సర్ నిర్థారణ అయిన వారిలో..

రొమ్ము క్యాన్సర్ గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ రొమ్ము క్యాన్సర్ ముఖ్యంగా మహిళల్లోనే కనిపిస్తుంది. ఈ క్యాన్సర్ చివరి దశలోనే గుర్తించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అందుకే అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. రొమ్ము క్యాన్సర్ నిర్థారణ అయిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ క్యాన్సర్ కేవలం మహిళల్లోనే కాకుండా.. పురుషుల్లోనూ కనిపిస్తుంది. మరి ఈ వ్యాధి లక్షణాలు పురుషుల్లో ఎలా ఉంటాయి? అందుకు కారణాలు, నివారణా చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:
1. రొమ్ము లేదా ఛాతీ భాగంలో గడ్డలుగా ఏర్పడతాయి. ఇవి పెద్దగా నొప్పి ఉండవు.
2. చర్మం కూడా మందంగా అనిపిస్తుంది. ఇవి సాధారణంగా కనిపించే లక్షణాల్లో ఒకటి.
3. రొమ్ముల ఆకారంలో, పరిమాణంలో మార్పులు రావడం. అంటే రొమ్ములకు వాపులు రావడం, ముడుచుకు పోయిన్నట్లు ఉంటుంది.
4. అలాగే చనుమొనల్లో ఎరుపుదనం, పొలుసులుగా చర్మం ఊడినిట్లు ఉండటం, చనుమొన లోపలకు వెళ్లినట్లు అవడం లాంటి లక్షణాలు ఉంటాయి.
5. చనుమొనల నుంచి ఏదైనా ద్రవం రావడం, ముఖ్యంగా రక్తం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కారణాలు:
1. వయస్సుతో పాటు రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన పురుషులకు ఎక్కువగా ప్రమాదం ఉంటుంది.
2. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రొమ్ము క్యాన్సర్‌తో బాధ పడిన వాళ్లు ఉంటే.. వీరికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
3. బీఆర్సీఏ 1, బీఆర్సీఏ2 వంటి జన్యువుల్లో వంశపారం పర్యంగా ఉత్పరివర్తనాలు సంభవిస్తాయి.
4. కాలేయ వ్యాధి, ఊబకాయం ఎక్కువగా ఉన్న వారిలో కూడా క్యాన్సర్ రావచ్చు. ఎందుకంటే వీరిలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెరుగుతాయి.
ఎలా కంట్రోల్ చేయాలి..
1. ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకోవాలి.
2. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల రోగాలు రాక తప్పదు.
3. అదే విధంగా ప్రతి రోజూ వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి. ఎక్సర్ సైజులు చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ వంటివి సమస్యలు ఎటాక్ చేయవు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








