AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloo Khichdi: కేవలం పదే నిమిషాల్లో ఈ కిచిడీ సిద్ధం.. రుచి అదుర్స్..

ఒక్కోసారి ఇంట్లోని పనుల వల్ల లేదంటే లేటుగా లేవడం వల్ల అస్సలు పని అవ్వదు. అందులోనూ బయట ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. ఒక్క అరగంట, గంట లేటు అయినా మొత్తం మారిపోతుంది. ఇలాంటి బిజీ టైమ్‌లో కూడా వంట త్వరగా పూర్తి చేయవచ్చు. అది కూడా రుచిగా చేయవచ్చు. అదేంటా అనుకుంటున్నారా.. ఆలూ కిచిడీ. కిచిడీల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల కిచిడీల గురించి తెలుసుకున్నాం. కిచిడీలు తినడం వల్ల..

Aloo Khichdi: కేవలం పదే నిమిషాల్లో ఈ కిచిడీ సిద్ధం.. రుచి అదుర్స్..
Aloo Khichdi
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 18, 2024 | 9:57 PM

Share

ఒక్కోసారి ఇంట్లోని పనుల వల్ల లేదంటే లేటుగా లేవడం వల్ల అస్సలు పని అవ్వదు. అందులోనూ బయట ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి మరింత గందరగోళంగా ఉంటుంది. ఒక్క అరగంట, గంట లేటు అయినా మొత్తం మారిపోతుంది. ఇలాంటి బిజీ టైమ్‌లో కూడా వంట త్వరగా పూర్తి చేయవచ్చు. అది కూడా రుచిగా చేయవచ్చు. అదేంటా అనుకుంటున్నారా.. ఆలూ కిచిడీ. కిచిడీల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రకాల కిచిడీల గురించి తెలుసుకున్నాం. కిచిడీలు తినడం వల్ల  ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చాలా ముందు రెసిపీ. ఇంతకు ముందు పెద్దలు కేవలం బియ్యం, పప్పు, బంగాళ దుంపలతో కలిపి కిచిడీ చేసేవారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు కూడా అందుతాయి. మరి ఈ రుచికరమైన ఆలూ కిచిడీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

ఆలూ కిచిడీకి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, ఆలు గడ్డలు, కంది పప్పు, నెయ్యి, పచ్చి మిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండు మిర్చి, పసుపు, కొత్తిమీర, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, జీరా పొడి, ఆయిల్.

ఆలూ కిచిడీ తయారీ విధానం:

కుక్కర్ గిన్నెలోకి ముందుగా బియ్యం, పప్పు కలిపి శుభ్రంగా తీసుకోవాలి. బియ్యం కప్పు తీసుకుంటే.. పప్పు అర కప్పు తీసుకుంటే చాలు. ఇందులోనే తోట కూర తరుగు, ఆలు గడ్డ ముక్కలు, పచ్చి మిర్చి వేసి మూత పెట్టి ఓ ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా అయితే కాస్త మెత్తగా ఉడుకుతాయి. వేడి చల్లారే వరకు కుక్కర్ పక్కన పెట్టాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఎండు మిర్చి వేసి వేగాక.. ఉల్లి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులో పసుపు, కొత్తిమీర, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా, జీరా పొడి, వేసి వేయించాలి. ఇవి వేగుతున్నప్పుడు ఉడకబెట్టిన అన్నం కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. చివరలో కొద్దిగా కొత్తిమీర వేస్తే సరి. ఎంతో రుచిగా ఉంటే ఆలూ కిచిడీ సిద్ధం.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్