Immunity Foods: బాడీలో ఇమ్యూనిటీని పెంచి.. రోగాలను దూరం చేసే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
శరీరం బలంగా, దృఢంగా ఉండాలంటే.. రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం. శరీరంలో ఇమ్యూనిటీ ఉంటే.. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. బాడీలో రోగ నిరోధక శక్తి సహజంగా పెరగాలంటే.. ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారు ఎక్కువగా జ్వరం, జలుబు వంటి సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు మొదలయ్యేది సమ్మర్ సీజన్. ఈ సీజన్‌లో ఎక్కువగా నీరసంగా ఉంటారు. ఈ క్రమంలోనే త్వరగా జబ్బుల బారిన..

శరీరం బలంగా, దృఢంగా ఉండాలంటే.. రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం. శరీరంలో ఇమ్యూనిటీ ఉంటే.. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. బాడీలో రోగ నిరోధక శక్తి సహజంగా పెరగాలంటే.. ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారు ఎక్కువగా జ్వరం, జలుబు వంటి సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు మొదలయ్యేది సమ్మర్ సీజన్. ఈ సీజన్‌లో ఎక్కువగా నీరసంగా ఉంటారు. ఈ క్రమంలోనే త్వరగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా జబ్బుల బారిన పడకుండ ఉండాలంటే.. ముందు నుంచే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వేసవిలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల.. ఇమ్యూనిటీ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
విటమిన్ సి ఉండే పండ్లు:
విటమిన్ సి ఉండే పండ్లు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. విటమిన్ సి ఉండే పండ్లు తింటే శరీరంలో తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో అంటు వ్యాధులు, వ్యాధులు రాకుండా ఉంటాయి. తెల్ల రక్త కణాలను శరీరరం ఉత్పత్తి చేయలేదు. కాబట్టి విటమిన్ సి ఉండే పండ్లు తింటే.. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇలా శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. ఆరెంజ్, గ్రేప్స్, బెర్రీస్, జామ పండ్లు, యాపిల్స్ వంటి పండ్లలో విటమిన్ సి లభిస్తుంది.
ఫ్లూయిడ్స్:
మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్, హెర్బల్ టీ, జ్యూస్‌లు తాగడం వల్ల కూడా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్ కంటే.. ఫ్రెష్‌గా తయారు చేసుకుని తాగడం మంచిది. మొదట ఎప్పుడూ ఇంట్లో చేసిన వాటికి ప్రాధాన్యం ఇవ్వండం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
కూరగాయలు – ఆకు కూరలు:
మీరు తినే ఆహారంలో రక రకాల కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకోండి. టమాట, బీట్ రూట్, క్యారెట్, పాలకూర, తోట కూర, వంకాయలు, బెండకాయలు, కాకర వంటివి తింటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.
వ్యాయామాలు:
తగిన ఆహారం తీసుకుంటూనే.. వ్యాయామాలు చేయడం కూడా చాలా మంచిది. ప్రతి రోజూ కనీసం ఇంట్లో అరగంట పాటైనా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు.. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభించి.. ఆరోగ్యంగా ఉంటారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




