Health Tips: ప్రతీ చిన్నదానికి కోపంతో ఊగిపోతున్నారా.? అయితే ఈ టిప్స్ మీకోసమే..
Health Tips: 'తన కోపమే తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష'.. ఇది చిన్నప్పుడు అందరూ చదువుకున్న పద్యమే. వినడానికి కోపం అనేది చిన్న పదమే అయినా పక్కవారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా తమ మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిస్తుంది...
Health Tips: ‘తన కోపమే తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష’.. ఇది చిన్నప్పుడు అందరూ చదువుకున్న పద్యమే. వినడానికి కోపం అనేది చిన్న పదమే అయినా పక్కవారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా తమ మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిస్తుంది. కోపం అనేది సహజమే అయినా కొందరిలో మాత్రం ఇది కంట్రోల్ చేసుకోలేని స్థాయిని దాటేస్తుంది. కోపాన్ని అస్సలు ఆపుకోలేక ఇతరులపైకి అరవడమే కాకుండా తమ మానసిక ప్రశాంతతను కోల్పోతుంటారు. అయితే మనం తీసుకునే ఆహారం కూడా కోపంపై ప్రభావంపై చూపుతుందని మీకు తెలుసా.? ఇంతకీ కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి.? లాంటి వివరాలు మీకోసం..
- కోపాన్ని కంట్రోల్ పెట్టుకోవాలంటే శరీరంలో విటమిన్ డి స్థాయిలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం వచ్చే లేలేత సూర్య కిరణాలు శరీరంపై పడేలా చూసుకోవాలి. అంతేకాకుండా గుడ్లు, పుట్ట గొడుగులు, చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
- ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే కోపం ఎక్కువగా వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, నూనెలో వేయించిన ఆహారాలను పూర్తిగా తగ్గించాలి.
- ఉప్పు బీపీ పెరగడానికి కారణమని మనందరికీ తెలిసిందే. ఉప్పు తగ్గించుకోవడం వల్ల కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే ప్యాకేజ్‌డ్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాన్ని మెనూలో భాగం చేసుకోవాలి. చేపలు, అవిసె గింజలు, గుడ్లు, బాదం పప్పు, వాల్‌నట్స్ వంటి వాటిలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల కోపం తగ్గిపోతుంది.
- శరీరంలో డోపమైన్ ఉండాల్సినంత ఉంటే కూడా కోపం కంట్రోల్ అవుతుంది. కాబట్టి డోపమైన్ ఎక్కువగా ఉండే చేపలు, చికెన్, గుడ్లు, చీజ్‌ను తీసుకోవాలి. వీటితో పాటు గుమ్మడికాయ విత్తనాలను తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
- చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల కూడా కోపం ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.
- ఇక తీసుకునే ఆహారంతో పాటు మెడిటేషన్, యోగా వంటి వాటిని కూడా అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే కోపం కంట్రోల్ అవడంతో పాటు మానసిక శాంతి కూడా మీ సొంతమవుతుంది.
Telangana Congress: మరో కీలక నేత కాంగ్రెస్‌ని వీడుతారా? హాట్ టాపిక్‌గా మారిన తాజా గుసగులు..!
‘నాన్నా.. లే నాన్నా.. లే’.. తండ్రి మృతదేహం వద్ద ఆరేళ్ల కూతురి ఆక్రందన.. కంటతడి పెట్టించిన ప్రమాదం