Tomatoes for Cancer: టమాటా తింటే జీవితంలో క్యాన్సర్ రాదట..! మీరు తింటున్నారా..
టమోటా.. ప్రతి ఇంట్లో ఈ కూరగాయ లేకుండా వంట సాధ్యం కాదు. దీనిని ప్రతి వంటకంలో ఉపయోగిస్తారు. టమాటా వంటకాల రుచిని పెంచుతుంది. అంతే కాదు ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి టమాటా క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

టమోటా.. ఈ పేరు వినని వారు దాదాపు ఉండరు. టమోటా సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ మొక్క. ప్రతి భారతీయ ఇంట్లో ఈ కూరగాయ లేకుండా వంట సాధ్యం కాదు. దీనిని ప్రతి వంటకంలో ఉపయోగిస్తారు. టమాటా వంటకాల రుచిని పెంచుతుంది. అంతే కాదు ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి టమాటా క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
టమోటాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
టమోటాలలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు గుండెకు హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. టమోటాలలో ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
కంటి ఆరోగ్యానికి
టమోటాలలో విటమిన్ ఎ తో పాటు లుటిన్, బీటా-కెరోటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణత నుంచి రక్షించడంలో సహాయపడతాయి. డిజిటల్ పరికరాలు విడుదల చేసే నీలి కాంతి నుంచి కళ్ళను రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
క్యాన్సర్ నివారణ
టమోటాలలో లభించే లైకోపీన్ క్యాన్సర్ నివారణకు కూడా సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
చర్మానికి మేలు
టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనితోపాటు వీటిల్లోని లైకోపీన్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రెండు అంశాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మం మీసొంతం అవుతుంది. అంతే కాదు, సూర్యకాంతి వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
ఇతర ప్రయోజనాలు ఇవి..
టమోటాలలో విటమిన్ సి తో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. టమోటాలలో విటమిన్ కె, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ టమోటాలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాదు టమోటాలలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఇది అతిగా తినడం ధోరణిని తగ్గిస్తుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








