Beauty Tips : ప్రస్తుత కాలంలో మెరిసే చర్మం కోసం చాలామంది రకరకాల ఉత్పత్తులను వాడుతున్నారు. ఇందులో వివిధ రసాయనాలు కలవడం వల్ల అవి శరీరంపై హాని కరమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతేకాకుండా వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అయితే ఎల్లప్పుడు దేశీ వస్తువులను వాడటం మంచిది. ఇవి చర్మానికి ఎటువంటి హాని కలిగించవు. అంతేకాకుండా చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
1. కలబంద అలోవెరా యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందినది. కలబంద బ్యూటీ ప్రొడక్ట్స్‌లలో ముఖ్యమైనది. ఇది మొటిమలను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. డార్క్ స్పాట్‌లను తగ్గిస్తుంది.
2. విటమిన్ ఈ పొడి చర్మం ఉన్న వ్యక్తులకు విటమిన్ ఇ చక్కగా పనిచేస్తుంది. ఇది మచ్చలు, డార్క్ స్పాట్స్‌కి చికిత్స చేస్తుంది. విటమిన్ ఇ ఆయిల్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది.
3. విటమిన్ సి విటమిన్ ఈ మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి పనిచేస్తే విటమిన్ సి దానిని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి 20+ అమ్మాయిలకు ఉత్తమమైన పదార్ధాలలో ఒకటి. ఎందుకంటే ఇది కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే వృద్ధాప్య సంకేతాలు, ముడతలు తగ్గిస్తుంది.
4. రోజ్ వాటర్ ఈ జాబితాలో రోజ్ వాటర్ కూడా ఉంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో గొప్పగా పని చేస్తుంది. ఇది డెడ్ సెల్స్‌ని తొలగించి మీ చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది. గొప్ప సహజ టోనర్‌గా పనిచేస్తుంది.
5.పెరుగు అందంకోసం పెరుగు చక్కగా పనిచేస్తుంది. వారానికి ఒక్కసారి పెరుగుతో పేస్ ఫ్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. మంచి గ్లో ఉంటుంది.