TS Eamcet 2021: నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు.. విద్యార్థులు తప్పకుండా ఈ సూచనలు పాటించాలి
తెలంగాణలో బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. విద్యార్థులు
తెలంగాణలో బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందే చేరుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా మాస్కులు ధరించాలని, సెల్ఫ్ డిక్లరేషన్ సైతం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కరోనా బారినపడ్డ విద్యార్థులకు సెషన్స్ అన్నీ పూర్తయ్యాక పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
బిట్‌శాట్ రాస్తున్న 1500 మందికి ఎంసెట్ పరీక్ష సమయం రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంకా అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలను 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందు కోసం తెలంగాణ వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థుల కోసం ఆ రాష్ట్రంలో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
విద్యార్థుల సౌలభ్యం కోసం మూడు భాషల్లో అంటే తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి: SI Suspended: మరిపెడ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారుల సీరియస్..
Price is more Than Gold: మీకు ఈ సంగతి తెలుసా.. ఈ పక్షి ఈకలు బంగారం ధర కంటే ఎక్కువ..