AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఒత్తిడికి, ఆస్తమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి.?

తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బందిపడే వారిలో ఆస్తమా ఎటాక్స్‌ చాలా తరచుగా కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని చాలా సందర్భాల్లో చూసినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. చిన్నారుల్లో స్కూలు పరీక్షలు, కుటుంబాల్లో గోడవలు, హింసకు గురికావడం వంటివి ఒత్తిడి పెరగడానికి కారణాలు..

Health: ఒత్తిడికి, ఆస్తమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి.?
Asthama
Narender Vaitla
|

Updated on: Oct 01, 2024 | 6:45 PM

Share

ఆస్తమా.. చాలా మందిలో కనిపించే సర్వసాధరమైన సమస్య. ఈ శ్వాసకోశ సమస్య కారణంగా ఇబ్బంది పడుతోన్న వారు చాలా మందే ఉన్నారు. శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బందితో మొదలయ్యే ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే బయటపపడం అంత సులువైన విషయం కాదు. ఇక ఆస్తమా బారిన పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని తెలిసిందే. అయితే ఒత్తిడి కూడా ఒక కారణమని మీకు తెలుసా.? ఒత్తిడికి, ఆస్తమాకు మధ్య ఉన్న సంబంధంపై పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బందిపడే వారిలో ఆస్తమా ఎటాక్స్‌ చాలా తరచుగా కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఆస్తమా లక్షణాలు కనిపించడాన్ని చాలా సందర్భాల్లో చూసినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. చిన్నారుల్లో స్కూలు పరీక్షలు, కుటుంబాల్లో గోడవలు, హింసకు గురికావడం వంటివి ఒత్తిడి పెరగడానికి కారణాలు మారితే అది ఆస్తమాకు ట్రిగ్గర్‌గా మారొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఒత్తిడి కారణంగా హిస్టమైన్, ల్యూకోట్రైన్‌ వంటి రసాయనాలను విడుదలయ్యేలయ్యేలా చేస్తుంది. ఇది ఆస్తమా అటాక్‌ కావడానికి కారణాలుగా మారుతాయని నిపుణులు అంటున్నారు. మిగతా సాధారణ వ్యక్తులతో పోలిస్తే… ఒత్తిడీ, యాంగ్జైటీ వంటి సమస్యలతో బాధపడేవారిలో ఆస్తమా ఉన్నప్పుడు వారి పరిస్థితిని నియంత్రించడం మరింత కష్టమవుతుందని చెబుతున్నారు. ఇలాంటి వారు ఒత్తిడిని నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషించాలని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కునే క్రమంలో యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అన్ని పనులను ఒకేసారి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకోకూడదు. ముందుగా మీరు చేయాల్సిన పనులను ఒక జాబితా రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఒక్కో టాస్క్‌ను పూర్తి చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి అలసట ఉండని వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను అలవాటు చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..