Dengue: డెంగ్యూ గుండె జబ్బులకు కారణమవుతుందా.? పరిశోధనల్లో సంచలన విషయాలు

తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ సంచనల విషయలు వెల్లడయ్యాయి. సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నేతృత్వంలో దీనిపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్-19తో పోలిస్తే డెంగ్యూ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 55 శాతం ఎక్కువని ఈ పరిశోధనలో వెల్లడైంది...

Dengue: డెంగ్యూ గుండె జబ్బులకు కారణమవుతుందా.? పరిశోధనల్లో సంచలన విషయాలు
Dengue
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 08, 2024 | 9:32 PM

డెంగ్యూ ఎంత ప్రమాదకరమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దోమకాటు వల్ల వచ్చే ఈ వ్యాధితో మరణాలు సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెంగ్యూ వచ్చిన వారిలో ఎన్నో రకాల ఇబ్బందులకు దారి తీస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ కారణంగా ఉన్నపలంగా శరీరంలో ప్లేటశ్రీలెట్స్‌ తగ్గిపోతాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే మనిషి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే డెంగ్యూ కారణంగా జ్వరం, ప్లేటెలెట్స్‌ తగ్గడం వంటి సమస్యలు మాత్రమే ఉంటాయని మనకు తెలుసు. కానీ డెంగ్యూ కారణంగా గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ సంచనల విషయలు వెల్లడయ్యాయి. సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నేతృత్వంలో దీనిపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్-19తో పోలిస్తే డెంగ్యూ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 55 శాతం ఎక్కువని ఈ పరిశోధనలో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్‌లో ఈ అధ్యయానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. 11,700 మందికి పైగా డెంగ్యూ రోగులు, 12 లక్షల మందికి పైగా కోవిడ్ -19 రోగుల వైద్య డేటాను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయాలను వెల్లడించారు.

నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ మోడలింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లీడ్ రచయిత లిమ్ జు టావో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులలో డెంగ్యూ ఒకటని తెలిపారు. గుండెపోటుతో పాటు, గుండె సంబంధిత వ్యాధుల కేసులు పెరగడానికి కోవిడ్-19 ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్‌ 19 తర్వాత గుండెపోటు కేసులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కోవిడ్‌ 19 కారణంగా రక్తం గడ్డకట్టడానికి కారణంగా మారిందని . దీంతో ధమనులలో రక్త ప్రవాహానికి అడ్డుకట్ట పడి గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతందని చెబుతున్నారు.

అయితే కోవిడ్-19 కంటే డెంగ్యూ మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. డెంగ్యూ తర్వాత గుండె ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సింగపూర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం, డెంగ్యూ భవిష్యత్తులో అనేక విధాలుగా శరీరంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. అనేక సందర్భాల్లో, కాలేయం దెబ్బతినడం, మయోకార్డిటిస్, నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే