AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ప్రెషర్ కుక్కర్‌లో ఎప్పుడైనా టీ పెట్టారా ? సోషల్​ మీడియాను షేక్​ చేసిన వీడియో!

సోషల్ మీడియాలో ఏదైనా వింతగా ఉంటే చాలు వైరల్​గా మారిపోతుంది, కోట్లలో వ్యూస్​, లక్షల్లో లైక్స్​, కామెంట్స్​తో ఇంటర్నెట్​ షేక్​ అవుతుంది​. గొప్ప సినిమా ట్రైలర్ కంటే, ఒక కుక్క బైక్ ఎక్కి వెళ్తున్న వీడియో… నోబెల్ బహుమతి గెలిచిన వార్త కంటే ..

Viral: ప్రెషర్ కుక్కర్‌లో ఎప్పుడైనా టీ పెట్టారా ? సోషల్​ మీడియాను షేక్​ చేసిన వీడియో!
Cooker Tea
Nikhil
|

Updated on: Nov 20, 2025 | 12:43 PM

Share

సోషల్ మీడియాలో ఏదైనా వింతగా ఉంటే చాలు వైరల్​గా మారిపోతుంది, కోట్లలో వ్యూస్​, లక్షల్లో లైక్స్​, కామెంట్స్​తో ఇంటర్నెట్​ షేక్​ అవుతుంది​. గొప్ప సినిమా ట్రైలర్ కంటే, ఒక కుక్క బైక్ ఎక్కి వెళ్తున్న వీడియో… నోబెల్ బహుమతి గెలిచిన వార్త కంటే, ‘ఈ రోజు నా టీ లో ఉప్పు వేశాను’ అనే ట్వీట్ ఎక్కువ రీచ్ సాధిస్తుంది! మన మెదడు సీరియస్ విషయాల కంటే షాక్, హాస్యం, అసాధారణతను బాగా గుర్తుపెట్టుకుంటుంది. వింతే వైరల్ రాణి – ఇదే సోషల్ మీడియా నియమం! తాజాగా ఓ టీ వీడియో సోషల్ మీడియాను షేక్​ చేస్తోంది.

చాయ్ అంటే భారతీయులకు ప్రాణం. ఉదయం లేవగానే, ఆఫీసు బ్రేక్‌లో, సాయంత్రం అల్లరి సెషన్లలో ఒక్క కప్పు చాయ్​ లేకపోతే రోజు పూర్తి కాలేదన్నట్టు ఫీలవుతారు చాలామంది. అలాంటి చాయ్‌ను ఇప్పుడు గిన్నెలో కాకుండా… ప్రెషర్ కుక్కర్‌లో వండేస్తున్నారు! అవును, మీరు చదివింది నిజమే. ఇన్‌స్టాగ్రామ్​లో @mosrrat_creation_4 అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ ‘నింజా టెక్నిక్’ వీడియో ఇప్పుడు లక్షల్లో వ్యూస్ కొట్టేస్తోంది. కామెంట్లలో ‘అరెరె! ఇంతకాలం మనం తప్పుగా చాయ్ తాగుతున్నామా రేయ్?’ అని ఆశ్చర్యపోతున్నారు.

వీడియోలో ఏముంది..

వీడియోలో ఒక అబ్బాయి కుక్కర్‌ను టీ కెటిల్‌గా మార్చేశాడు. ప్రాసెస్ సూపర్ సింపుల్ 5 నిమిషాల్లోనే టీ పెట్టి చూపించాడు. అంతేకాదు, ఎలా పెట్టాలో కూడా వివరించాడు. ముందు కుక్కర్‌లో కొంచెం నీళ్లు పోసి, గ్యాస్ మీద పెట్టి ప్రెషర్​ పెట్టాలి. ఇప్పుడు పాలు, చాయ్ పొడి, చక్కెర మూడూ ఒకేసారి వేసేయండి. మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వచ్చాక, ప్రెషర్ వదిలేసి మూత తీస్తే ఘాటైన అరోమా గల చాయ్ రెడీ! స్ట్రైనర్‌లో వడకట్టి కప్పుల్లో పోసుకుంటే ఘుమఘుమలాడే టీని ఆస్వాదించవచ్చు.

వీడియో చూడండి..

ఎందుకు వైరల్ అయింది?

సాధారణంగా గిన్నెలో చాయ్ చేస్తే 10-15 నిమిషాలు పడుతుంది, అంతేకాక పాలు పొంగి పొర్లుతుంటాయి. కుక్కర్‌లో రెండు విజిల్స్‌తోనే ఫ్లేవర్ లాక్ అయిపోతుంది. ప్రెషర్ వల్ల చాయ్ పొడి నుంచి టానిన్స్, అరోమా పూర్తిగా బయటికి వస్తాయి. పాల పొంగు టెన్షన్ లేకుండా, సూపర్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇది దాదాపు ఎస్ప్రెస్సో మెషిన్ లాంటి పని చేస్తుందని నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇంకేముంది వీడియో సోషల్​ మీడియాలో ట్రెండింగ్​లోకి వచ్చేసింది.

ఫన్నీ కామెంట్స్​

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘దీదీ… మనం ఇంతకాలం ఏం తాగుతున్నాం?’ అని ఒకరు అడిగితే, ‘రోజుకి నాలుగు సార్లు చాయ్ తాగితే… కుక్కర్ డిష్‌వాషర్‌లా మారిపోతుంది బ్రో!’ అని మరొకరు, ‘ఇంట్లో అమ్మకి చూపిస్తే… నా మొహం మీద కుక్కర్ విసిరేస్తుంది’ అని మరొకరు కామెంట్​ చేశారు. అంతేకాదు, చెఫ్ రణ్‌వీర్ బ్రార్ కూడా ఈ వీడియోను రీపోస్ట్ చేసి ‘పీక్ జుగాడ్ ఇన్నోవేషన్’ అని కామెంట్ పెట్టారు! అట్లుంటది మరి సోషల్ మీడియా మేనియా!

Follow Us
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
హైదరాబాద్‌లో ‘గ్యాస్’ సెగ: సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్లు
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్