AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eating raw meat: అక్కడంతా పచ్చి మాంస భక్షకులే! మరి వారికి ఏమీ కాదా? ఆసక్తికర విషయాలు..

జపాన్ అంటే కేవలం టెక్నాలజీనే అందరికీ గుర్తొస్తుంది. ఈ దేశానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే ఫుడ్. ఈ జపనీస్ ఫుడ్ కి ప్రపంచంలో మంచి గుర్తింపే ఉంది. అయితే అక్కడి ప్రజలు మాంసాన్ని, చేపలను పచ్చిగానే ఆరగిస్తారు.

Eating raw meat: అక్కడంతా పచ్చి మాంస భక్షకులే! మరి వారికి ఏమీ కాదా? ఆసక్తికర విషయాలు..
Eating Raw Meat
Madhu
|

Updated on: Feb 28, 2023 | 10:15 AM

Share

మాంసం, చేపల్లో చాలా రకాల ప్రోటీన్లు, ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. అయితే మనం దేనినైన వండుకొని తింటాం. కానీ ఆ దేశంలో మాత్రం మాంసాన్ని వండకుండా పచ్చిగానే తినేస్తారు. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? తలచుకుంటేనే ఇబ్బందిగా అనిపిస్తోందా? ఆ దేశంలో అంతేనండి! చేపలు, మాంసం అన్ని దాదాపు పచ్చిగానే తింటారు. పైగా అలా పచ్చి మాంసం తినడం ఆరోగ్యదాయకని చెబుతున్నారు. వివరాలు కావాలంటే ఈ కథనం చివరి వరకూ చదవండి.

జపాన్‌ ఇలా తింటారు..

జపాన్ అంటే కేవలం టెక్నాలజీనే అందరికీ గుర్తొస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పూర్తిగా నాశనమైన ఆ దేశం మళ్లీ పుంజుకున్న తీరు చాలా గొప్పది. లెటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో దీనిని మించిన దేశం లేదనే చెప్పాలి. అలాగే ఈ దేశానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే ఫుడ్. ఈ జపనీస్ ఫుడ్ కి ప్రపంచంలో మంచి గుర్తింపే ఉంది. అయితే అక్కడి ప్రజలు మాంసాన్ని, చేపలను వండుకొని తినరు. పచ్చిగానే కొన్ని ఇన్‌గ్రేడియంట్స్‌ దానికి కలుపుకొని ఆరగిస్తారు. ఎందుకలా చేస్తారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అలా చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? ఓ సారి చూద్దాం..

పచ్చిగానే ఎందుకు తింటారు..

జపాన్‌ ఆహార సంప్రదాయ ప్రకారం మాంసం, చేపలు వంటివి పచ్చిగానే తింటారు. దానిలో మంచి ఫ్లేవర్‌ ఇచ్చే సోయా సాస్‌, వాసంబీ వంటి యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు కలిగిన మససాలను.. పచ్చి మాంసాన్ని బాగా కడిగి, కట్‌ చేసిన తర్వాత యాడ్‌ చేసుకొని తినేస్తారు. జపనీస్ వంటకాలు నిస్సందేహంగా ఆరోగ్యకరమైన ఆసియా వంటకాలలో ఒకటి. చాలా రుచికరమైనవి కూడా. స్థానికంగా లభించే చేపలు, మాంసం, పులియబెట్టిన సాస్‌లు, బియ్యం, మిరపకాయలు, తీపి పదార్థాలతో తయారు చేయబడతాయి. కానీ చాలా గ్లోబల్ గౌర్‌మాండ్‌లు జపనీస్ వంటకాల గురించి చెప్పగలిగే ఒక విషయం ఏమిటంటే, పచ్చి మాంసం, చేపల వాడకం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పాక సంస్కృతులకు భిన్నంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యానికి మంచిదే..

పచ్చి చేపలు లేదా మాంసాన్ని బాగా కడిగి, శుభ్రం చేసి, సరైన పదార్థాలతో మ్యారినేట్ చేసిన తర్వాత తినడానికి సరిపోయేలా చేయవచ్చు. అయితే కొన్ని విధాలుగా పచ్చి మాంసం చేపలను తినడం ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే మాంసాన్ని వేయించడం, మాంసం లేదా చేపలను కాల్చడం వల్ల ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు విచ్ఛిన్నం అవుతాయి. అందువల్ల దాని పోషక గుణాలు తగ్గుతాయి. అంతే కాదు, మాంసం చేపలను వండడం లేదా వేయించడం వల్ల కూడా హెటెరోసైక్లిక్ అమైన్‌ల వంటి హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి, ఇది అనేక రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకనే వారు పచ్చి మాంసాన్ని తింటారు.

ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌..

జపనీస్ వంటకాలు ఆరోగ్యకరమైన వంటకాల్లో ఒకటిగా పరిగణించబడటానికి కారణం వారి ఆహార తయారీ విధానం. వారు ఆహార పదార్థాలను అనేకసార్లు శుభ్రపరచడం, కడగడం చేస్తారు. అంతేకాక వాటిని పులియబెట్టిన, సుగంధ ద్రవ్యాలతో మెరినేట్ చేసి బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా చేస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..