Married Men: పెళ్లైన మగవారిలోనే ఆ సమస్య ఎందుకు.. దీని వెనుక అసలు కారణం ఇదే..
వివాహం తర్వాత స్త్రీ, పురుషులలో అనేక మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా పురుషులు వివాహం అయిన వెంటనే బరువు పెరగడం ప్రారంభిస్తారు. అందరూ దీనిని గమనించే ఉంటారు. ముఖ్యంగా పొట్ట ముందుకు తన్నుకొస్తుంటుంది. అప్పటివరకు కాలేజీ కుర్రాళ్లలా ఉండే వారు కూడా పెళ్లైన వెంటనే బరువు పెరిగిపోతుంటారు. ఒక్కరనే కాదు దాదాపుచాలా మంది పురుషులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది.. దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ కారణాలున్నాయా? లేక ఇది కేవలం అపోహ మాత్రమేనా అనే విషయాలు తెలుసుకుందాం.

వివాహం తర్వాత చాలా మంది మగవారు పొట్ట దగ్గర కొవ్వు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటారు. అయితే, కొంతమంది వివాహం తర్వాత అబ్బాయిలు ఇలా బరువు పెరిగిపోవడం చూసి ఆటపట్టిస్తుంటారు. భార్య ప్రేమగా వండిపెట్టడం వల్ల కలిగే ఫలితం అని చెబుతారు. కానీ నిజానికి ఇది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య అని పరిశోధకులు అంటున్నారు. పోలాండ్‌లోని వార్సాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో, పెళ్లికాని పురుషుల కంటే పెళ్లైన వారిలోనే ఊబకాయం వచ్చే ప్రమాదం 62 శాతం ఎక్కువగా ఉందని తేలింది . అదే సమయంలో, మహిళల్లో ఈ పెరుగుదల 39 శాతంగా కనిపించిందని వైద్య నిపుణులు అంటున్నారు.
రెండు వేల మందికి పైగా అధ్యయనం
పోలాండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు 2,405 మంది వ్యక్తుల నుండి డేటాను విశ్లేషించారు, వీరిలో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారు. వీరిలో 35.3 శాతం మంది సాధారణ బరువు కలిగి ఉండగా, 38.3 శాతం మంది అధిక బరువుతో, 26.4 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వివాహం తర్వాత పురుషులలో ఊబకాయం వచ్చే ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అయితే, ఈ ప్రభావం మహిళల్లో తక్కువగా కనిపించింది.
ఊబకాయం వయస్సు సంబంధ సమస్యలు
అధ్యయనాలు కూడా వయస్సు పెరిగే కొద్దీ బరువు పెరిగే సంభావ్యత పెరుగుతుందని చూపించాయి. పెరుగుతున్న వయస్సుతో, బరువు పెరిగే అవకాశం ప్రతి సంవత్సరం పురుషులలో 3% స్త్రీలలో 4% పెరుగుతుంది. అదే సమయంలో, ఊబకాయం ప్రమాదం పురుషులలో 4 శాతం స్త్రీలలో 6 శాతం పెరుగుతుంది.
పెళ్లికి బరువుకి మధ్య సంబంధం
వివాహం తర్వాత పురుషులలో బరువు పెరగడానికి ప్రధాన కారణాలు అధికంగా ఆహారం తీసుకోవడం, సామాజిక ఆహారపు అలవాట్లు మరియు శారీరక శ్రమలు లేకపోవడం అని చాలా మంది నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో, ఒబేసిటీ హెల్త్ అలయన్స్ డైరెక్టర్ కేథరీన్ జెన్నర్ మాట్లాడుతూ, స్థూలకాయం అనేది కేవలం వ్యక్తిగత ఎంపికల ఫలితం మాత్రమే కాదని, సామాజిక, మానసిక మరియు పర్యావరణ కారకాల కలయిక అని ఈ అధ్యయనం మరొక ఉదాహరణ అని అన్నారు.
నిపుణులు ఏమి చెప్పారు
వివాహం తర్వాత పురుషుల జీవనశైలి మారుతుందని, ఇది వారి బరువును ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, పురుషుల ఆరోగ్యానికి ఈ సమస్యను పరిష్కరించడానికి మరింత లక్ష్య వ్యూహం అవసరం, ముఖ్యంగా వారి ఆహారం జీవనశైలిని పరిగణనలోకి తీసుకుంటే. దీని కోసం, మొదట మీరు మీ కొవ్వు ఆహారం తీసుకోవడం నియంత్రించాలి. అప్పుడు మీరు మీ ఆహారపు అలవాట్లను కూడా నియంత్రించుకోవాలి. దీనితో పాటు, సమతుల్య ఆహారం, వ్యాయామం తగినంత నిద్ర పోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
