AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Donation: రక్తదానం చేసి వందల ప్రాణాలు కాపాడిన రాహుల్.. 64 ఏళ్లలో కూడా సూపర్‌ఫిట్

రక్తం ఇచ్చిన తర్వాత బలహీనులవుతారు అనే అపోహ ప్రజలలో ఉంది. అయితే అది అస్సలు నిజం కాదు. రక్తదానం గొప్ప దానం. చాలా మంది ప్రాణాలను కాపాడడంతోపాటు రక్తదానం చేసే వ్యక్తి శరీరానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. ప్రతి వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు అని రాహుల్ చెప్పారు.

Blood Donation: రక్తదానం చేసి వందల ప్రాణాలు కాపాడిన రాహుల్.. 64 ఏళ్లలో కూడా సూపర్‌ఫిట్
Blood Donor Rahul
Surya Kala
|

Updated on: Aug 19, 2023 | 1:06 PM

Share

ప్రస్తుత కాలంలో మారిన అలవాట్లతో వయసుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన పడేవారు కొందరు అయితే.. యాక్సిడెంట్ బారిన పడి ప్రమాదాల బారిన పడేవారు ఇంకొందరు.. ముఖ్యంగా  20 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు కూడా అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఓ 64 ఏళ్ల వృద్ధుడు రాహుల్ సోలాపుర్కర్ నేను వయసు రీత్యా పెద్దవాడిని కానీ..  చాలా ఫిట్‌గా ఉన్నాను అని చెబుతున్నాడు. రాహుల్ తన ఫిట్‌నెస్ వెనుక 48 ఏళ్ల కథ ఉందని చెబుతున్నాడు. తాను స్కూల్లో ఉన్న సమయంలో ఒక ఉపాధ్యాయుడు రక్తదానం ప్రాముఖ్యత గురించి చెప్పాడు. అప్పుడు ఈ విషయం తన మనస్సులో నాటుకుంది. అంతేకాదు అప్పుడే.. తాను రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు రాహుల్. 18 ఏళ్లు దాటిన వెంటనే రక్తదానం చేయడం మొదలుపెట్టి ఇప్పటి వరకు చేస్తునే ఉన్నానని చెప్పారు రాహుల్. 1976లో ఆల్ ఇండియా ఎన్‌సీసీ పరేడ్‌లో తొలిసారి రక్తదానం చేసినట్లు రాహుల్ సోలాపుర్కర్ చెప్పారు. అలా మొదలైన రక్తదానం నేటి వరకు  కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రాహుల్ వయస్సు 64 సంవత్సరాలు.. రక్తదానం చేసే ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది.

గత 46 ఏళ్లలో 174 సార్లు రక్తదానం చేసినట్లు రాహుల్ చెప్పారు. నిరంతర రక్తదానం చేయడం వలన తనకు ఈ వయసులో కూడా షుగర్, రక్తపోటు, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, కిడ్నీ జబ్బులు లేవని పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటి వరకూ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ శాతంలో ఉన్నట్లు గుర్తించలేదని.. అంతేకాదు ఇప్పటి వరకూ వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల ఎలాంటి తీవ్రమైన అనారోగ్య బారిన పడలేదని చెప్పారు. నిరంతరం రక్తదానం చేయడం వల్ల శరీరం ఎంత ఫిట్‌గా ఉంది. ఈ వయసులో కూడా ఎలాంటి మందులు తీసుకోలేదని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తానని చెప్పారు. నేను చేసిన రక్తదానంతో వేలాది  మందికి కొత్త జీవితం లభించిందని పేర్కొన్నారు.

రక్త దానం విషయంలో అపోహ

రక్తం ఇచ్చిన తర్వాత బలహీనులవుతారు అనే అపోహ ప్రజలలో ఉంది. అయితే అది అస్సలు నిజం కాదు. రక్తదానం గొప్ప దానం. చాలా మంది ప్రాణాలను కాపాడడంతోపాటు రక్తదానం చేసే వ్యక్తి శరీరానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు.

ఇవి కూడా చదవండి

వ్యాధుల నుండి నివారణ

ప్రతి వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు అని రాహుల్ చెప్పారు. ఇలా చేయడం వలన కలిగే ప్రయోజనాలు అపారమైనవి. తరచుగా రక్తదానం చేసిన వ్యక్తి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి స్థిరంగా ఉంటుంది. BP, షుగర్ సమస్య కలగదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులను నివారిస్తుంది. రక్తదానం చేయడం వలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువని చెబుతున్నారు.

క్రమం తప్పకుండా రక్తదానం చేసేవారికి రోగాల సమస్యలు ఉండవని తాను ఖచ్చితంగా చెప్పనని అయితే కొన్ని రకాల వ్యాధులున్నవారు.. కొన్ని రకాల కారణాల వలన రక్తదానం చేయకూడదని చెప్పారు. అయితే  చాలా సందర్భాల్లో రోగికి సమయానికి రక్తం కూడా అందదు. ఆసుపత్రుల్లో రక్తానికి డిమాండ్ ఉన్నా తగినంత సరఫరా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ చాలామందిలో రక్తదానం గురించి అవగాహన లేక రక్తదానం చేయడానికి ఆలోచిస్తారు. శరీరం బలహీనపడుతుందని భావిస్తారు.  అయితే ఈ ఆలోచన పూర్తిగా తప్పు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..