AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో బాధపడుతున్నారా..? అయితే నల్ల మిరియాలను ట్రై చేయండి..! వైరస్‌ని తరిమికొట్టండి..

Black Pepper Health Benefits : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్కా పేషెంట్లు

కరోనాతో బాధపడుతున్నారా..? అయితే నల్ల మిరియాలను ట్రై చేయండి..! వైరస్‌ని తరిమికొట్టండి..
Black Pepper
uppula Raju
|

Updated on: Apr 28, 2021 | 9:59 PM

Share

Black Pepper Health Benefits : దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్కా పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బెడ్స్ దొరికినా ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటువంటి సమయంలో చాలామంది కరోనా లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. అటువంటి వారు వంటింట్లో ఉండే నల్ల మిరియాలతో వైరస్‌ను తరిమికొట్టొచ్చు. మిరియాలకు ప్రాచీన ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎన్నో రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని మన రుషులు, మునులు తెలిపారు. అయితే కరోనా కషాయాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పది నల్ల మిరియాలు, పది తులసి ఆకులు, అల్లం ముక్క, నాలుగు వందల గ్రాముల నీరు అన్నీ కలిపి సన్నని మంటపై కాచాలి. నాలుగు వందల గ్రాముల నీరు వంద గ్రాములు అయ్యేంత వరకు కాచాలి. తర్వాత ఆ కషాయాన్ని వడకట్టి ఉదయం, సాయంత్రం అన్నం తిన్న తర్వాత తాగాలి. ఇలా చేస్తే వారం రోజుల్లో వైరస్ పని ఖతమవుతుందని ఆయర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మిరియాలు ఈ ఒక్క కషాయానికి మాత్రమే కాదు ఇంకా చాలా రోగాలను నయం చేస్తుంది.

కింగ్ ఆఫ్ స్పైసెస్ గా పిలువబడే మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. సాధారణంగా మన దేశంలో తెల్ల, నల్ల మిరియాలను మాత్రమే వాడుతుంటారు. వంటలకు ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మిరియాల్లో అధికంగా ఉండే పెపెరైన్ అనే ఆల్కలాయిడ్ జీర్ణవ్యవస్థలో ఎక్కువ మొత్తంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నివిడుదల చేస్తుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలోని ప్రొటీన్లు ఈజీగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్, విరేచనాలు సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి మిరియాలను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

ఆకలిగా తక్కువగా వుండే వారు ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి రోజూ తీసుకుంటే.. ఆకలి పెరుగుతుంది. చిన్న పిల్లల్లో లేదా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా దగ్గు, జబులు వస్తూ ఉంటుంది. ప్రతిసారి మందులు వాడటం మంచిది కాదు. అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Telangana Corona: తెలంగాణ కరోనా కేసులపై హోంశాఖ మంత్రి సమీక్ష.. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు

మీ ఏటీఎం కార్డు పోయిందా..? అయితే వెంటనే ఇలా చేయండి..! లేదంటే చాలా నష్టపోతారు..