AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసుపుతో డయాబెటిస్ కంట్రోల్..! బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో మార్పు.. ఎలాగో తెలుసుకోండి..?

Turmeric Health Benefits : భారత వంటకాలలో అత్యంత ముఖ్యంగా వాడే పదార్థము పసుపు. ఈ భూమి మీద అతి శక్తివంతమైన హెర్బల్ పౌడర్‌గా పసుపును

పసుపుతో డయాబెటిస్ కంట్రోల్..! బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో మార్పు.. ఎలాగో తెలుసుకోండి..?
Basil Leaves Benefits
uppula Raju
|

Updated on: Apr 29, 2021 | 1:00 PM

Share

Turmeric Health Benefits : భారత వంటకాలలో అత్యంత ముఖ్యంగా వాడే పదార్థము పసుపు. ఈ భూమి మీద అతి శక్తివంతమైన హెర్బల్ పౌడర్‌గా పసుపును గుర్తించారు ఆయుర్వేద నిపుణులు.. ఎన్నో ఏళ్ల నుంచి సనాతన ఆయుర్వేదంలో పసుపును ఔషధంగా వాడుతున్నారు. ఎన్నో రోగాలకు మంచి మందుగా పనిచేస్తుంది. పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది. పసుపుని ఆయుర్వేదంలో, సంప్రదాయ చైనీస్ ఔషధంలో, సిద్ధ ఔషధం, యునానిలో కూడా వాడతారు. అయితే తాజాగా పసుపు డయాబెటీస్‌పై చక్కటి ప్రభావం చూపిస్తుందని తేలింది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుందని గుర్తించారు.

2013లో జరిపిన అధ్యయనం ప్రకారం… టర్మరిక్ (పసుపు)లో ఉండే కర్క్యుమిన్ (curcumin) అనే పదార్థం బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించగలదు. డయాబెటిస్ వల్ల తలెత్తే ఇతర సమస్యల్ని కంట్రోల్ చెయ్యగలదని తేలింది. పసుపులోని కర్క్యుమా లోంగా అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి విష వ్యర్థాలు, వైరస్, బ్యాక్టీరియా అంతు చూస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ (విష వ్యర్థాలు)… మనకు చాలా నష్టాలు తెస్తాయి. కర్క్యుమిన్ మన శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. అందువల్ల రక్తనాళాల్లో కొవ్వు కరిగి… శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అది డయాబెటిస్ తగ్గేందుకు, కంట్రోల్ అయ్యేందుకూ వీలు కలిగిస్తుంది.

పసుపు ఒక శక్తివంతమైన సమ్మేళనం, శరీరంలో మంట తగ్గిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ ఆర్థరైటిస్ చికిత్సలో కూడా సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలను మార్పు చేస్తుంది. ఇబూప్రోఫెన్ లేదా ఆస్పిరిన్ మాదిరిగా కాకుండా పసుపు పనితీరు సురక్షితంగా మరియు సహజంగా ఉంటుంది. కర్కిమిన్ ప్రోటీన్ విడుదలను నిరోధిస్తుంది అది వాపు, నొప్పిని ప్రేరేపిస్తుంది. కక్యూమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. పసుపు ఈ శోథ నిరోధక ప్రభావాలు క్యాన్సర్ చికిత్సలో కూడా సహాయపడతాయి.

అలాగే మన శరీరంలోని పాంక్రియాటిక్ కణాల పనీతీరును మెరుగుపరిచే శక్తి కర్క్యుమిన్‌కి ఉంది. ఈ కణాలనే బీటా సెల్స్ అంటారు. వీటిని పునరుత్పత్తి చెయ్యడంలో కర్క్యుమిన్ ఉపయోగపడుతుంది. కాలేయం (లివర్)లో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడంలో పసుపు బాగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ఇది పెంచుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అందువల్ల అన్నీ వంటల్లో పసుపు వాడటం మేలు.

Samsung M42g: సామ్‌సంగ్‌ నుంచి ఎం42 5జీ మొబైల్‌ మార్కెట్లో విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!

Char Dham Yatra: ఆలయాలపై కరోనా ఎఫెక్ట్.. చార్‌ధామ్ యాత్రను రద్దు.. యధావిథిగా నిత్య పూజలు

బెంగుళూరులో 3 వేలమంది కోవిడ్ పాజిటివ్ రోగులు మిస్సింగ్, పోలీసుల సాయంతో ఆచూకీకై యత్నాలు