Donkey Milk Business: చదివింది అరకొర చదవులే.. గాడిద పాల వ్యాపారంతో భారీ సంపాదన..

తమిళనాడులో మొదటి గాడిద ఫారమ్‌ను స్థాపించాడు. అనేక రకాల కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్న సంస్థకు లీటరు గాడిద పాలను రూ.7,000 లకు విక్రయిస్తున్నాడు ఈ యువ వ్యాపారవేత్త.

Donkey Milk Business: చదివింది అరకొర చదవులే.. గాడిద పాల వ్యాపారంతో భారీ సంపాదన..
Donkey Farm Near Tirunelvel
Follow us
Surya Kala

|

Updated on: May 19, 2022 | 11:24 AM

Donkey Milk Business: గాడిద పాలలో అనేక ఔషధగుణాలున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా గాడిదపాలకు డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఒక వ్యాప్తి.. ఆవు, గేదె, మేక వంటి జంతువులను పెంచుకున్నట్లే.. ఇప్పుడు గాడిదలను కూడా పెంచుతున్నాడు. లీటర్ గాడిదపాలను ఏకంగా ఏడు వేలకు అమ్మి.. లక్షలను ఆర్జిస్తూ.. ప్రముఖ వ్యాపారవేత్త అయ్యాడు.  అతను చదివిన చదువుకు స్వస్తి చెప్పి.. నేడు అనేక మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు. ఇప్పటికే ఎవరైనా సరిగ్గా చదువుకోకపోయినా, చెప్పిన మాట వినక పోయినా వెంటనే భవిష్యత్ లో గాడిదలను పెంచుకోవడానికి మాత్రమే పనికి వస్తావు అంటూ కామెంట్ చేయడం పరిపాటి. ఆ మాటనే స్ఫూర్తిగా తీసుకుని పదువురికి స్ఫూర్తివంతమైన ఆ వ్యాపారవేత్త తమిళనాడుకి(Tamilandu ) చెందిన యు. బాబు(MR. Babu) గురించి తెలుసుకుందాం..

తమిళనాడులోని తిరునెల్వేలి సమీపంలో తొలి గాడిద ఫారమ్‌ను ఏర్పాటు చేసిన బాబు.. ఆ జంతువుల పాలను బెంగళూరులోని ఓ కాస్మెటిక్ ఉత్పత్తుల సంస్థకు సరఫరా చేస్తున్నారు. నువ్వు చదువుకోక పొతే.. భవిష్యత్ లో  ‘గాడిదలను పెంచడానికి మాత్రమే సరిపోతావని అనే మాట సక్సెస్ బాటలో పెట్టారు బాబు. వన్నార్‌పేట్‌కు చెందిన యు. బాబు.. చదువు మధ్యలోనే గుడ్ బై చెప్పేశాడు. తమిళనాడులో మొదటి గాడిద ఫారమ్‌ను స్థాపించాడు. అనేక రకాల కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్న సంస్థకు లీటరు గాడిద పాలను రూ.7,000 లకు విక్రయిస్తున్నాడు ఈ యువ వ్యాపారవేత్త.

బాబు 11వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు.. అప్పుడు బాబు తన చదువుకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఫార్మా ఉత్పత్తుల పంపిణీలో ప్రవేశించాడు. 28 యునిసెక్స్ కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ ప్రతి నెలా 1,000 లీటర్ల గాడిద పాలను సరఫరా చేసే వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఈ విషయం బాబు దృష్టికి చేరింది. తమిళనాడులో మొత్తం 2,000 గాడిదలు కూడా లేవని తెలుసుకున్నాడు. అంతేకాదు ఒక్క గాడిద రోజుకు 350 ml మాత్రమే పాలు ఇవ్వగలదని తెలుకున్నాడు. దీంతో తానే సొంతంగా ‘గాడిద ఫారం’ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆచరణలో పెట్టడానికి కుటుంబ సభ్యులతో చర్చించాడు.

ఇవి కూడా చదవండి

తిరునెల్వేలి సమీపంలో గాడిద ఫారమ్‌ను ప్రారంభించాలనే తన ఆలోచనను అతను తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే బాబు ఆలోచనను భార్య సహా అందరూ సపోర్ట్ చెయ్యలేదు.  అయితే వారికి గాడిద పాలకు ఉన్న డిమాండ్ గురించి వివరించేందుకు ప్రయత్నించగా.. భార్యతో సహా ఎవరూ నమ్మలేదు. అయినప్పటికీ బాబు తన ప్రయత్నాలు కొనసాగించాడు. వృద్ధాచలం జిల్లా నుండి 10 ml గాడిద పాలను ₹ 50కి విక్రయించడానికి తిరుగుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించాడు.  గాడిదపాలలో వృద్ధాప్యాన్ని నిరోధించే మూలకాలతో పాటు, పసిపిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని గ్రామీణ ప్రజల నమ్మకం. దీంతో బాబు అతని స్నేహితుడి నుండి 17 ఎకరాల భూమిని కౌలుకి  తీసుకున్నాడు. ‘డాంకీ ప్యాలెస్’ ను ఏర్పాటు చేసి.. మొత్తం 100 గాడిదల పెంపకాన్ని మొదలు పెట్టాడు. ఆ గాడిదల సంరక్షణ కోసం పడాళం సమీపంలోని పూవనూరు నుంచి కొంతమంది తీసుకుని వచ్చారు.

ఇపుడు గాడిదల ఫారమ్ లో గుజరాత్‌కు చెందిన హలారి గాడిదలు, తమిళనాడులోని దేశ రకంతో పాటు మహారాష్ట్రకు చెందిన కతియావాడి ఉన్నాయి. “దేశీయ రకానికి చెందిన గాడిద సుమారు రూ.40,000.  అయితే రోజుకు 1 లీటర్ పాలు ఇచ్చే హలారిస్ అనే గాడిద ధర మాత్రం.. రూ ₹1 లక్ష,” అని ఆయన చెప్పారు. ఇక గాడిదలకు మేలైన ఆహారం కోసం స్వయంగా మేత సాగునీ కూడా చేస్తున్నాడు. రాగులు, పచ్చి గడ్డి వంటి అనేక రకాలను జంతువులకు మేతగా సాగు చేస్తున్నారు.

గాడిదల పెంపకం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. పూవనూరు కుటుంబం. వాటికీ పోషకారం, స్నానం చేయించడం.. పాలు పితకడం వంటి అనేక పనులు చేస్తున్నారు. ఇక  గాడిదలకు ఎక్కువగా జలుబు వల్ల వచ్చే జబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. జలుబుతో బాధపడుతున్న గాడిదలను మందనుంచి వేరు చేసి..  ప్రత్యేకంగా ఉంచుతారు.

బాబు ఫ్యామిలీలో ఒకరైన జి. సంతోష్‌ కోయంబత్తూరు సమీపంలోని కోవిల్‌పాళయంలోని ఓ కళాశాలలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అయినప్పటికీ గాడిదలను సంరక్షిస్తున్నాడు. తాను భవిష్యత్ లో ఉద్యోగం చేయనని.. బాబు బాటలో నడుస్తూ.. గాడిద పాలు మార్కెటింగ్ విభాగాన్ని చూసుకుంటానని తెలిపారు.

గాడిద పాలలో అనేక ఔషధ గుణాలున్నాయి. వీటిని శీతలీకరించి, స్నానపు సబ్బులు, చర్మం, జుట్టు సంరక్షణ కోసం లోషన్లు, క్రీమ్ మొదలైన వాటితో సహా సౌందర్య సాధనాలను తయారు చేస్తారు. గాడిద పాలతో తయారు చేసిన సబ్బు ధర కొంచెం అధికంగానే ఉంటుంది.

ఇక తాము యూరప్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి పని చేస్తున్నాము” అని మిస్టర్ బాబు చెప్పారు, ఒక భారతీయ బిలియనీర్ రిటైల్ వెంచర్ ఈ కాస్మెటిక్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి చర్చలు జరుపుతోంది. ఇక బాబు ఇప్పుడు బెంగళూరుకు చెందిన కాస్మెటిక్ తయారు సంస్థ భాగస్వాములలో ఒకరు. చదువుకు వ్యాపారానికి సంబంధం లేదని.. డిమాండ్ అండ్ సప్లయి సూత్రాన్ని మార్కెట్ లోని వినియోగదారుల ఆలోచన నాడిని అర్ధం చేసుకుంటే వ్యాపారంలో సక్సెస్ అందుకోవచ్చునని నిరూపించారు బాబు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..