AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daughter in Law Remarriage: కోడలికి లక్షల కట్నం ఇచ్చి మరో పెళ్లి చేసిన అత్తమామలు..నెట్టింట్లో ఫోటోలు వైరల్..

తమ కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. కోడలి జీవితంలో వెలుగులు నింపాలని భావించారు. తమ కోడలికి తల్లిదండ్రులుగా మారిపోయి.. రెండో వివాహం చేశారు.. తమ ఆస్తిని కూడా రాసిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Daughter in Law Remarriage: కోడలికి లక్షల కట్నం ఇచ్చి మరో పెళ్లి చేసిన అత్తమామలు..నెట్టింట్లో ఫోటోలు వైరల్..
Daughter In Law Remarriage
Surya Kala
|

Updated on: May 19, 2022 | 9:45 AM

Share

Daughter in Law Remarriage: కరోనా మహమ్మారి చాలామంది జీవితాలను ఛిద్రం చేసింది. ఎవరికి ఎవరు కాకుండా చేసింది. ఎందరో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు, భార్యలను పోగొట్టుకున్న భర్తలు, భర్తలను కోల్పోయిన భార్యలు.. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఇలా ఎందరి జీవితాల్లోనో చీకటి నింపింది. ఇలా ఎందరో తమ కుటుంబ సభ్యులను కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. సొంతవారిని కూడా పక్కకు పెట్టె రోజులు వచ్చాయి. అయితే ఓ దంపతులు తాము అందరికంటే బిన్నం అని నిరూపించారు. అంతేకాదు.. తాము అందరికంటే విభిన్నమైన అత్తమామలమని నిరూపించారు. తమ కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. కోడలి జీవితంలో వెలుగులు నింపాలని భావించారు. తమ కోడలికి తల్లిదండ్రులుగా మారిపోయి.. రెండో వివాహం చేశారు.. తమ ఆస్తిని కూడా రాసిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్​ప్రకాష్‌ తివారి కుమారుడు ప్రియాంక్ తివారి భోపాల్ నెట్‌లింక్ కంపెనీలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. 2011 నవంబర్‌ 27వ తేదీన రిచా తివారీతో పెళ్లి జరిగింది. ప్రియాంక్ తివారి దంపతులకు  అన్య తివారీ (9) కూతురు కూడా ఉంది. సంతోషంగా సాగిపోతున్న వీరి కుటుంబంలో కరోనా తీవ్ర విషాదం నింపింది. గత ఏడాది ప్రియాంక్ తివారీ గత ఏడాది కరోనా బారిన పడ్డాడు. 2021 ఏప్రిల్‌ 25వ తేదీన కోవిడ్‌ తో మరణించాడు. ప్రియాంక్ మరణం  కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రియాంక్‌ మృతితో అతని భార్య వితంతువుగా మారిపోయింది. అయితే కోడలు, మనవరాలి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రియాంక్ తివారి తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

తమ కోడలికి పెళ్లి చేసి.. జీవితంలో కొత్తవెలుగులు నింపారు. వితంతువు అయిన కోడలు రిచా తివారీని అక్షయ తృతీయ నాడు నాగ్‌పూర్ నివాసి వరుణ్ మిశ్రాకు ఇచ్చి వివాహం జరిపించారు.  తన సొంత ఖర్చుతో వైభవంగా కోడలికి పెళ్లి చేశారు. అంతేకాదు తమ కుమారుడు కొన్న రూ.60 లక్షల విలువజేసే.. ఇంటిని కోడలికి బహుమతిగా ఇచ్చారు.  రిచా తన పెళ్లి తర్వాత కూతుర్ని కూడా తీసుకుని కొత్త అత్తవారి ఇంట్లో అడుగు పెట్టింది. ప్రస్తుతం రిచాపెళ్లికి సంబంధించిన ఫొటోలో  నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కోడలిని హింసించే అత్తామామలున్న ఈ రోజుల్లో రిచాకు తల్లిదండ్రులుగా మారిన అత్తామామలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..