Skin Care: జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా..! అయితే ఈ 3 ఫేస్‌వాష్‌లు చక్కటి పరిష్కారం..
Skin Care Tips : జిడ్డు చర్మంపై మొటిమలు సాధారణం. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. అంతేకాదు చర్మంపై రంధ్రాలు మూసుకుపోతాయి.

Skin Care Tips : జిడ్డు చర్మంపై మొటిమలు సాధారణం. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. అంతేకాదు చర్మంపై రంధ్రాలు మూసుకుపోతాయి. అయితే జిడ్డు చర్మాన్ని శుభ్రం చేయడానికి మార్కెట్లో అనేక రకాల ఫేస్ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి ప్రభావం కొద్దికాలం మాత్రమే ఉంటుంది. కానీ మీరు జిడ్డు చర్మం కోసం ఇంట్లోనే ఫేస్ వాష్ తయారుచేసుకొని ఉపయోగించవచ్చు. వీటి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. రోజ్ వాటర్ రోజ్ వాటర్ జిడ్డు చర్మం గలవారికి చక్కగా పనిచేస్తుంది. దీనిని అనేక రెడీమేడ్ ఫేస్ వాష్‌లలో ఉపయోగిస్తారు. స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ మెయింటన్ చేయడంలో సహాయపడుతుంది. కాటన్ ప్యాడ్ మీద కొద్దిగా రోజ్ వాటర్ చల్టుకొని చర్మాన్ని శుభ్రం చేయాలి. ఇది తక్షణమే మీ చర్మాన్ని తాజాగా చేస్తుంది.
2. నిమ్మ, తేనె ప్యాక్ నిమ్మ, తేనె రెండు చర్మానికి గొప్పగా ఉపయోగపడుతాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. నిమ్మకాయ జిడ్డు చర్మానికి మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. తేనె మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి సహాయపడుతుంది. దీని కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. 5 నుంచి10 నిమిషాలు అలాగే ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. కాఫీ ఫేస్ వాష్ జిడ్డుగల చర్మాన్ని శుభ్రం చేయడానికి కాఫీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై ఏర్పడే ఆయిల్‌ని తొలగిస్తుంది. కాఫీలోని ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు చర్మం పిహెచ్ బ్యాలెన్స్‌ని నియంత్రించడానికి సహాయపడతాయి. దీని కోసం ఒక గిన్నెలో 1 టీస్పూన్ కాఫీ పౌడర్, 1 టీస్పూన్ నీరు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి స్క్రబ్ చేయాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి.



