MI Vs PBKS, IPL 2021: విఫలమైన పంజాబ్ బ్యాట్స్‌మెన్స్.. ముంబయి టీం టార్గెట్ 136

MI Vs PBKS, IPL 2021: కీలకమైన మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో ముంబయి టీంపై 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

MI Vs PBKS, IPL 2021: విఫలమైన పంజాబ్ బ్యాట్స్‌మెన్స్.. ముంబయి టీం టార్గెట్ 136
Ipl 2021 Mi Vs Pbks
Follow us

|

Updated on: Sep 28, 2021 | 9:27 PM

MI vs PBKS Live Score in Telugu: IPL 2021 లో డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా నేడు రెండవ మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (MI vs PBKS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సీజన్ 42 వ మ్యాచ్‌గా జరగుతుంది. కీలకమైన మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో ముంబయి టీంపై 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ టీంకు మంచి ఆరంభం లభించలేదు. కేవలం టీం స్కోర్ 36 పరుగుల వద్ద ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (15) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన క్రిస్‌గేల్(1) కూడా ఆకట్టుకోలేకపోయాడు. పొలార్డ్ బౌలింగ్‌లో హార్థిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే ఓవర్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (21) కూడా ఔటయ్యాడు. పూరన్ (2)కూడా నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దీపర్ హుడా(28 పరుగులు), మక్రాం (42పరుగులు, 29 బంతులు, 6 ఫోర్లు) అర్థ సెంచరీ భాగస్వామ్యం ఏర్పరిచి పంజాబ్ మంచి స్కోర్ సాధించేందుకు సహాయపడ్డారు.

హాఫ్ సెంచరీకి చేరువైన మక్రాంను బుమ్రా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ భారీ సాధించే ఆశలు ఆవిరయ్యాయి. ముంబయి బౌలర్లలో బుమ్రా, పొలార్డ్ చెరో రెండు వికెట్లు, పాండ్యా, రాహుల్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.

Also Read: 12 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి..! 8వ స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మెన్ జట్టు పరువు కాపాడాడు..

IPL 2021, KKR vs DC Match Result: కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయం.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘోర పరాజయం