12 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి..! 8వ స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మెన్ జట్టు పరువు కాపాడాడు..

Cricket News: క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపిఎల్ 2021పై ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లాండ్‌లో బాబ్ విల్లిస్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

12 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి..! 8వ స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మెన్ జట్టు పరువు కాపాడాడు..
Bob Willis Trophy

Cricket News: క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపిఎల్ 2021పై ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లాండ్‌లో బాబ్ విల్లిస్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పోటీ విపరీతంగా ఉంది. తాజాగా మంగళవారం బాబ్ విల్లిస్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో లంకాషైర్ జట్టుతో వార్విక్‌షైర్ జట్టు పోటీ పడింది. అయితే వార్‌విక్‌షైర్ ఫాస్ట్ బౌలర్లు కేవలం12 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ఆధిపత్యం చెలాయించారు.

ఇటీవల లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్‌ బౌలర్లు చాలా బాగా రాణిస్తున్నారు. అది టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్‌ అని చూడకుండా వికెట్లు సాధిస్తున్నారు. ప్రస్తుతం బాబ్ విల్లిస్ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా ఇదే జరిగింది. టాస్ గెలిచిన వార్‌విక్‌షైర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మూడో ఓవర్‌లో మొదటగా లంకాషైర్ ఓపెనర్ జార్జ్ బాల్డెర్సన్ వికెట్ కోల్పోయాడు. ఇక్కడి నుంచి బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కి క్యూ కట్టారు.

వార్విక్ ఫాస్ట్ బౌలర్లు క్రెయిగ్ మిల్స్, లియామ్ నార్వెల్ 9 ఓవర్లలో సగం లాంక్షైర్ జట్టు వికెట్లు తీశారు. స్కోర్‌బోర్డ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే ఉన్నాయి లాంక్‌ షైర్‌ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. మిల్స్ వీటిలో 4 వికెట్లు తీయగా నార్వెల్ రెండు వికెట్లు తీశాడు. లంకాషైర్ చాలా తక్కువ స్కోరుకే ఆలౌట్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో జోష్ బోహన్నన్, ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మన్ ల్యూక్ వుడ్ 35 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి జట్టు పరువు కాపాడారు. ఇంతలో వర్షం అంతరాయం కలిగింది. అప్పటికి జోహాల్ మరో 3 వికెట్లు తీసి లాంక్‌ షైర్‌ని 57/9 కి తగ్గించాడు. ల్యూక్ వుడ్ చివరి వరకు పోరాడాడు. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నించాడు. చివరి వికెట్ కోసం మాట్ పార్కిన్సన్ తో కలిసి 21 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. చివరకు 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

AP CM YS Jagan: గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం.. ఆక్వా రైతులకు నేరుగా సబ్సిడీలుః సీఎం జగన్

Police Enthusiasm: పోలీసుల అత్యుత్సాహం.. పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ ప్రసవం కోసం వెళ్తున్న గర్భిణీ కారుపై ప్రతాపం

Jobs 2021: నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ఎలా అప్లై చేయాలంటే..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu