IPL 2021, KKR vs DC Match Result: కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయం.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘోర పరాజయం

KKR vs DC, IPL 2021: 128 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2021, KKR vs DC Match Result: కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయం.. 3 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘోర పరాజయం
Ipl 2021 Kkr Vs Dc
Follow us
Venkata Chari

|

Updated on: Sep 28, 2021 | 7:23 PM

KKR vs DC, IPL 2021 Match Result: కోల్‌కతా టీం అన్ని రంగాల్లో అద్బుత ప్రతిభ చూపి ఢిల్లీ క్యాపిటల్స్ టీంపై విజయం సాధించింది. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ల ధాటికి ఢిల్లీ టీం ఏదశలోనూ కోలుకోలేకపోయింది. 128 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేరుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్మన్ గిల్ 30, వెంకటేష్ అయ్యర్ 14, రాహుల్ త్రిపాఠి 9, నితీష్ రాణా 36 నాటౌట్, మోర్గాన్ 0, దినేష్ కార్తీక్ 12, సునీల్ నరైన్ 21 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో అవేష్ ఖాన్ 3, అన్‌రిచ్, అశ్విన్, లలిత్, రబాడా తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆటకు పూర్తి భిన్నంగా ఆడింది. దీనికి కారణం కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లు. అద్భుతంగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించారు.

ఓపెనర్ ధావన్ (24 పరుగులు, 20 బంతులు, 5 ఫోర్లు) ఊపుమీదున్నట్లు కనిపించినా.. 4.6 ఓవర్లో ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులో నిలిచేందుకు బ్యాట్స్‌మెన్లు అంతగా ఇంట్రస్ట్ చూపించనట్లు కనిపించారు. స్టీవ్ స్మిత్ 39(34 బంతులు, 4 ఫోర్లు), శ్రేయాస్ అయ్యర్ 1, హెట్ మెయిర్ 4, లలిత్ యాదవ్ 0, అక్షర్ పటేల్ 0 త్వరగా పెవిలియన్ చేరి నిరాశపరిచారు.

ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ (39), అశ్విన్ (9) కొద్దిసేపు కేకేఆర్ బౌలర్లను గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. కానీ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో ఢిల్లీ టీం నిర్ణీత ఓవర్లలో తక్కువ పరుగులు మాత్రమే చేసింది. అయితే విచిత్రమేమిటంటే ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా రాకపోవడం విశేషం. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లలో ఫెర్గ్యూసన్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read: MI vs PBKS Live Score in Telugu: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి టీం

IPL 2021: గిర్రున బ్యాట్ తిప్పిన రిషబ్.. దినేష్ కార్తీక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. వైరలవుతోన్న వీడియో

పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
పుష్ఫ 2 సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసుకున్న షెకావత్ సార్
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
కంటెంట్ ఉంటే కోట్లు.. లేదంటే పాట్లు.. చిన్న సినిమాలపై చిరు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
డాక్టర్‌ లేకపోవడంతో... ఈ వాచ్‌మెనే ఇలా వైద్యుడు అయ్యాడు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
తంతే బకెట్ బిర్యానీలో పడ్డారు.. కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా మారుతోంది: మంత్రి
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు వెటరన్ ప్లేయర్లు..
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసీస్‌కు ఆ స్టార్ పేసర్
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట
బండి ఎక్స్‌పెయిరీ అయితే మాత్రం OLXలో కూడా అమ్మేందుకు వీలు లేదట
పెర్ట్ టెస్ట్ కోసం రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలెవన్ అదిరిపోయిందిగా
పెర్ట్ టెస్ట్ కోసం రవిశాస్త్రి ప్లేయింగ్ ఎలెవన్ అదిరిపోయిందిగా