IPL 2021: గిర్రున బ్యాట్ తిప్పిన రిషబ్.. దినేష్ కార్తీక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. వైరలవుతోన్న వీడియో

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీం ఎంతో అద్భుతంగా ఆడింది. అయితే ఈ రోజు జరిగిన కోల్‌కతా మ్యాచులో మాత్రం చాలా తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు.

IPL 2021: గిర్రున బ్యాట్ తిప్పిన రిషబ్.. దినేష్ కార్తీక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. వైరలవుతోన్న వీడియో
Rishabh Pant Dinesh Karthik
Follow us

|

Updated on: Sep 28, 2021 | 6:17 PM

IPL 2021, KKR vs DC: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీం ఎంతో అద్భుతంగా ఆడింది. అయితే ఈ రోజు జరిగిన కోల్‌కతా మ్యాచులో మాత్రం చాలా తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. అయితే, మంగళవారం సెప్టెంబర్ 28, కోల్‌కతా బౌలర్ల ముందు మాత్రం ఢిల్లీ బ్యాట్లకు పెద్దగా పరుగులు రాలేదు. కోల్ కతా బౌలర్లు త్వరగా ఢిల్లీ బ్యాట్స్ మెన్స్‌ను పెవిలియన్‌కి పంపిచి, తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ భారీ స్కోర్ చేస్తాడని భావించినా.. విఫలమయ్యాడు. అయితే, రిషబ్ సాధారణంగా తన బ్యాటింగ్‌తో బౌలర్లను భయపెట్టేవాడు. కానీ, ఈ మ్యాచులో కోల్‌కతా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను భయపెట్టాడు.

షార్జాలో జరిగిన మ్యాచ్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. కోల్‌కతా జట్టు బ్యాటింగ్ దారుణంగా ఫ్లాప్ అయింది. ఇంతలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు కోసం పరుగులు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో పంత్ చేసిన ఒక చర్య అందరినీ భయపెట్టింది. 17 వ ఓవర్‌లో పంత్ బ్యాట్‌ను సూపర్ స్పీడ్‌తో తిప్పడంతో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు ప్రాణాంతకం అయ్యేదే. కానీ, ఈ ప్రమాదం నుంచి కార్తీక్ కొద్దిలో తప్పించుకున్నాడు.

వరుణ్ చక్రవర్తి వేసిన తొలి బంతిని పుల్ చేయాలని పంత్ భావించాడు. కానీ, బంతి బ్యాట్ దిగువన తగిలి స్టంప్స్ వైపు రావడం ప్రారంభమైంది. వికెట్ కీపర్ కార్తీక్ బంతిని పట్టుకోవడానికి ముందుకు వంగాడు. అదే సమయంలో, బంతిని ఆపడానికి పంత్ ప్రమాదకరమైన రీతిలో బ్యాట్‌ను వేగంగా తిప్పాడు. ఆ వేగానికి కార్తీక్ కొంచెం ముందుకు వచ్చినట్లైతే తలకు చాలా బలంగా తాకేది. అదృష్టం కార్తీక్‌కు అనుకూలంగా ఉండడంతో ఏం కాలేదు.

ఈ సంఘటన తర్వాత పంత్ వీపర్ కార్తీక్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆపై అది చూసి నవ్వడం ప్రారంభించారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆటకు పూర్తి భిన్నంగా ఆడింది. దీనికి కారణం కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లు. అద్భుతంగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లలో ఫెర్గ్యూసన్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్ తలో రెండు వికెట్లు, సౌతీ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: KKR vs DC, IPL 2021: ఢిల్లీ జోరుకు బ్రేకులు వేసిన కేకేఆర్ బౌలర్లు.. తక్కువ పరుగులకే కట్టడి.. కోల్‌కతా టార్గెట్ 128

IPL 2021: ఎట్టకేలకు ‘మిస్టరీ గర్ల్’ నవ్వింది.. హైదరాబాద్‌ జట్టుకు ధన్యవాదాలంటూ నెటిజన్ల ట్వీట్లు

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..